ఈ ఇంట్లో చిన్నపాప ఉంది… బిజెపి నాయకులారా….ఓటు కోసం ఇంట్లోకి రావొద్దండి

కథూవా, ఉన్నావ్‌లో బిజెపి దేశభక్తులు చేసిన దురాగతాలతో రగిలిపోతున్న జనం అందుకు తగిన తీరిలోనే స్పందిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న కర్నాటకలో ‘మా ఇంట్లో చిన్నపాప ఉంది…ఓటు కోసం వస్తున్న బిజెపి నాయకులారా మా ఇంట్లోకి రాకండి’ ఇంటి బయట బోర్డు పెడుతున్నారు. ఈ బోర్డులను చూసి బిజెపి నేతలు తలదించుకోవాల్సిన పరిస్థితి. కథువా, ఉన్నావ్‌ ఘటనలపై బిజెపి నాయకులు నోరు మెదపడం లేదు. మాట్లాడితే దేవుడి పేరు చెప్పి నానా హైరానా చేసే ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు దేవుడి పేరు కూడా చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అసిఫాను నిర్బంధించి, లైంగికంగా వేధించింది ఓ ఆలయంలోనే. ‘నా బిడ్డ కోసం ఎక్కడెక్కడో వెతికాను…కానీ ఆలయం వైపు వెళ్లాలన్న ఆలోచన కూడా రాలేదు. ఆలయం పవిత్రమైనది. అక్కడ ఏమి జరుగుతుందిలే అనుకున్నాను. తీరాచూస్తే ఆలయంలోనే నా బిడ్డను ఛిద్రం చేశారు’ అని అసిఫా తండ్రి చెబుతున్న మాటలు జనం చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇలాంటి బరితెగింపును చూసిన జనం….’ఈ ఇంట్లో చిన్నపాప ఉంది…బిజెపి నాయకులారా….ఓటు కోసం ఇంట్లోకి రావొద్దండి’ అంటూ ఇంటిముందు బోర్డుపెట్టి మరీ వెలివేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*