ఉద్యోగానికి రాలేను…ఇంట్లో తపస్సు చేసుకోవాలి

ఉద్యోగానికి రాలేను…ఇంట్లో తపస్సు చేసుకోవా

గుజరాత్ లో ఓ ప్రభుత్వ ఉద్యోగి చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారట. తాను విష్ణుమూర్తి అవతారమైన కల్కిని అని, తాను ఇంట్లోనే ఉంటూ తపస్సు చేసుకోవాలని, ఆఫీసుకు రాలేనని చెబుతున్నారట. రమేశ్‌ చంద్ర అనే ఇంజినీరు గడచిన 8 నెలల్లో 16 రోజులు మాత్రమే విధులకు హాజరయ్యాడు. దాంతో ఉన్నతాధికారులు షోకాజు నోటీసులు పంపించారు. దీనికి ఆయన విచిత్రమైన సమాధానం ఇచ్చారు.
‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడానికి నేను ఇంటిదగ్గర తపస్సు చేస్తున్నాను. నేను కార్యాలయంలో కూర్చొని చేయలేను. నేను చేసిన పూజల ఫలితంగానే దేశంలో వర్షపాతం నమోదవుతోంది. తొందర్లోనే నేను కల్కి అవతారమని అందరు గుర్తిస్తారు. నేను ఆఫీసులో కూర్చుంటే వర్షాలు పడవు. కరువు అలాగేవుంటుంది. నేను ఆఫీసుకు రావడం ముఖ్యమో, కరువు నుంచి దేశాన్ని కాపాడటం ముఖ్యమో తేల్చుకోండి’ అని వీడియో సందేశం పంపించారట. దీంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తలపట్టుకున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*