ఏసి కెపాసిటీని టన్నుల్లో లెక్కిస్తారు…ఎందుకు?

వేసవి ఎండలు మండిపోతున్నాయి. జనం అల్లాడిపోతున్నారుగానీ….ఎసిలు, ఫ్యాన్లు, కూలర్లు అమ్మే వ్యాపారులకు; వాటిని తయారు చేసే కంపెనీలకు వేసవి వచ్చిందంటే అంతాఇంతా ఆనందం కాదు. ఈ ఎండలు ఇంకా మండిపోవాలని కూడా వారు కోరుకుంటారు. ఎందుకుంటే…ఎండలు ఎంత తీక్షణంగా ఉంటే ఏసిలు, కూలర్లు, ఫాన్లు అంత ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఇటీవల కాలంలో కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు కూడా ఏసిలను కొనుగోలు చేస్తున్నారు. ఏసి కొనుగోలు కోసం షాపునకు వెళ్లినపుడు 1 టన్‌ ఏసి కావాలా, 1.5 టన్‌ ఏసీ కావాలా అని అడుగుతుంటారు. ఇంతకీ ఏసిలకు టన్నుల్లో ఎందుకు చెబుతున్నారు. సాధారణంగా బరువులను కొలవడానికి టన్నులు ఉపయోగిస్తారు. 1 టన్‌ ఏసి అంటే…ఆ ఏసి బరువు ఒక టన్ను ఉంటుందనా? కాదు….ఏసిల సామర్థ్యాన్ని (కెపాసిటీని) టన్నుల్లో లెక్కిస్తారు. ఇంతకీ ఏసికి టన్నుల లెక్క ఎందుకొచ్చింది?

ఎయిర్‌ కండిషనర్‌ అంటే….వాతావరణంలోని గాలిని మనం అనుకున్న కండిషన్‌లోకి తీసుకురావడమే. గాలిలోని ఉష్ణోగ్రతను తగ్గించడం. ఒకప్పుడు ఏసిలు లేనపుడు….ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ల మంచుగడ్డలను కొనుగోలు చేసి ఇంటిలో పెట్టుకునేవాళ్లు. అది కరిగి చల్లదనాన్ని ఇచ్చేది. అమెరికాలో ఇలాంటి మంచుగడ్డలను టన్నుల్లో విక్రయించేవారు. గది విస్తీర్ణం బట్టి…ఒకటన్ను, ఒకటిన్నర టన్ను, రెండు టన్నులు లెక్కన ఐగ్‌ గడ్డలను కొనుగోలు చేసేవారు. ఈ లెక్కలే ఏసిలకూ వచ్చింది. కొండగుర్తుగా చెప్పాలంటే ఒక టన్ను మంచుగడ్డకు సమానమైన చల్లదనాన్ని ఇచ్చే ఏసిని 1 టన్ను ఏసి అంటారు. అదే 1.5 టన్నుల మంచుగడ్డతో సమానమైన చల్లదనాన్ని ఇచ్చే ఏసిని 1.5 టన్‌ ఏసి అని అంటారు.

ఒకటన్ను మంచుగడ్డ 286,000 బిటియు (ట్రిటీష్‌ థర్మరల్‌ యూనిట్స్‌ – ఉష్ణాన్ని కొలిచే పరిమాణం) వేడిని గ్రహిస్తుంది. దీన్ని ఒక రోజుకు లెక్కిస్తే….టన్ను మంచుగడ్డ 24 గంటల్లో యూనిఫాంగా కరిగితే…గంటకు 11,917 బిటియు వేడిని గ్రహిస్తుంది. అంటే గాలి నుంచి తొలగిస్తుంది. దీన్ని 12,000 బిటియు / గంటగా స్థిరీకరించారు. అంటే గంటకు 12,000 బిటియు వేడిన తొలగించే సామర్థ్యమున్న ఏసిని 1 టన్‌ ఏసి అంటారు. 1.5 టన్‌ ఏసి అంటే గంటకు 18,000 బిటియు వేడిని తొలగిస్తుందన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*