కాణిపాకం వినాయకునికి శివయ్య పట్టువస్త్రాలు

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీకాళహస్తి ఈవో చంద్రశేఖర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో దేవుళ్ళు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం శ్రీకాళహస్తి ఈఓ , అధికార బృందం తీసుకు లవచ్చిన పట్టువస్త్రాలను కాణిపాకం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం మూషిక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ ఏఈవో విద్యాసాగర్రెడ్డి, ఇతర అధికారులు వారికి తీర్థప్రసాదాలు, చిత్రపటాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు శ్రీధర్ బాబు కిషోర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*