కిరణ్‌ కుమార్‌ రెడ్డి సైకిల్‌ ఎక్కినట్లేనా?

 

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గత ఎన్నికల్లో సమైకాంధ్ర పార్టీ స్థాపించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన ఊసే ఎక్కడా కనిపంచలేదు. బిజెపిలో చేరుతారని, తెలుగుదేశంలో చేరుతారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే….తాజా మరిణామాలను చూస్తుంటే, ఆయన సైకిల్‌ ఎక్కినట్లే అనుకోవాలి.

నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తమ్ముడు నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి కొన్ని నెలల క్రితం తెలుగుదేశంలో చేరారు. ఆయనకు ఇప్పుడు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవి ఇచ్చారు. కిశోర్‌ కుమార్‌ రెడ్డికి పదవి ఇవ్వడమంటే…కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఇచ్చినట్లే భావించాలి. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నామినేటెడ్‌ పదవులు తీసుకోవడం బాగుండదు కనుక…కిరణ్‌ తమ్ముడు కిశోర్‌కు ఇచ్చారు. నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకర్గంలో కొంత పట్టువుంది. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, మదనపల్లి నియోజకవర్గాల్లో పట్టు కలిగిన వైసిపి కీలకనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిలువరించడం కోసం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ప్రయోగించాలని తెలుగుదేశం భావిస్తోంది. తెలుగుదేశం ఎత్తుగడులు ఎలావున్నా….ఆ పార్టీలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*