గాలిలోని తేమతో తాగునీరు రెడీ..!శ్రీకాళహస్తి వైకాపా ఆఫీసులో అధునాతన యంత్రం ఏర్పాటు..!!

   సాధారణంగా తాగునీరు కావాలంటే కుళాయిలు, బావులు , చెరువులు ద్వారా తెచ్చుకుని తాగడం పరిపాటి. ఈ నీటినే అధికశాతం మంది ఉపయోగిస్తున్నారు కూడా. ఇంకొందరైతే కుళాయిల నీటిని ఫిల్టర్ ద్వారా శుద్దిచేసి వినియోగిస్తున్నారు. అయితే ఇవేవీ కాకుండా గాలిలోని తేమతో నీరు తయారు చేసి ఆనీటిని ఉపయోగించే మిషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నుంచి ఇలాంటి మిషన్ ద్వారా తయారైన శుద్ధి నీటిని అక్కడి కి విచ్చేసే ప్రజలకు అందుబాటులో కి తెచ్చారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.

   విద్యుత్ సరఫరా ఉంటేచాలు. ఈ యంత్రం గాలిలోని తేమను గ్రహించి ఆ తేమను నీరుగా మార్చి నిల్వ ఉంచుతుంది. ఇలా ఈ మిషన్ రోజుకు 25 లీటర్ల నీటిని ఇస్తుందట. మిషన్ లో నీరు ఎంత ఉండేది తెలిసేలా చిన్న పాటి లైట్లు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మిషన్ విలువ 65 వేల రూపాయలు ఉంటుందని‌ సమాచారం. గాలిద్వారా తయారు అయ్యే ఈనీరు ఎలాంటి కలుషితం అయ్యే అవకాశం లేకుండా స్వచ్ఛమైన విగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రజలంతా ఈనీటినే ఉపయోగిస్తున్నారు.   
       .... ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*