తెల్లవార్లూ కేసులు విచారించిన జడ్జి

మన కోర్టుల్లో కేసులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. అది కిందిస్థాయి మున్సబ్‌ కోర్టుగానీ, అత్యున్నత సుప్రీంకోర్టుగానీ పెండింగ్‌ కేసులు న్యాయమూర్తులకు పెద్ద సమస్యగా మారాయి. కేసులను పరిష్కరించడానికి రాత్రింబవళ్లూ పనిచేస్తున్న న్యాయమూర్తులున్నారు. ముంబై హైకోర్టులో ఓ న్యాయమూర్తి తెల్లవార్లూ కేసులు విచారించారు. హైకోర్టుకు వేసవి సెవులువు ప్రారంభం అవుతున్న తరుణంలో…షారూక్‌ జె కథావాలా అనే న్యాయమూర్తి తెల్లవారి జాము 3.30 గంటల దాకా కేసులు విచారించారు. అత్యవసరంగా విచారించాల్సిన కేసులు వందకుపైగా ఉండటంతో….ఆయన తెల్లవారుజాము దాకా పని చేయడానికి సిద్ధపడ్డారు. సినిమాల్లో చూపించినట్లు సాయంత్రం ఐదు గంటలు కాగానే కోర్టును వాయిదా వేసి వెళ్ళే పరిస్థితి ఉండదు. పొద్దుపోయేదాకా కూడా వింటుంటారు కొందరు న్యాయమూర్తులు. షారూక్‌ జె కథావాలా మాత్రం తెల్లవారుజాము దాకా అలాకే….బెంచ్‌లోనే ఉండిపోయారు. దీన్ని చూసిన న్యాయవాదులు ఆశ్చర్యపోయారు. ఆయన ఉదయం 10 గంటలకు వచ్చినపుడు ఎంత చురుగ్గా ఉన్నారో తెల్లవారుజాము 3.30 గంటల సమయంలోనూ అంతే చురుగ్గా ఉన్నారని న్యాయవాదులు చెప్పారు. ఏమైనా జస్టిస్‌ షారూక్‌ జె కథావాలా న్యాయమూర్తులకు ఆదర్శమవుతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*