పేద నిర్మాత నారాయణమూర్తికి పెద్దనోట్ల ఇక్కట్లు!

పేదల కష్టాలను ప్రతిబింబిస్తూ సినిమాలు తీసే నారాయణమూర్తి కారుకూడా లేకుండా ఆటోల్లో తిరుగుతుంటారు. అలాంటి వ్యక్తికి పెద్దనోట్లతో ఏ ఇబ్బంది వచ్చింది…అనే అనుమానం రావచ్చు. నిజంగానే ఇబ్బంది వచ్చింది. రైతుల కష్టాలు కడగండ్లే కథావస్తువుగా ఆయన తీసిన ‘అన్నదాత సుఖీభవ’ చిత్రం ఈనెల 14న అంబేద్కర్‌ జయంతి రోజున రిలీజ్‌ కావాల్సివుంది. అయితే సెన్సారు బోర్డు ఈ సినిమాకు కొర్రీలు వేసింది. పెద్దనోట్ల రద్దుతో రైతులకు ఎదురైన కష్టాలను ఈ సినిమాలో చూపించారట. ఈ దృశ్యాల్లో సెన్సార్‌ బోర్డుకు బూతు కనిపించిందో, దేశ ద్రోహం కనిపించిందో తెలియదుగానీ….ఆ సీన్లు తీసేయాలని ఆదేశించింది. అదేవిధంగా రైతులకు, కార్పొరేట్‌ సంస్థలకు మధ్య ఉన్న తేడాను చూపిస్తూ చిత్రీకరించిన దృశ్యాలనూ తొలగించాలని చెప్పారట. దీనిపైన నారాయణమూర్తి మండిపడుతున్నారు. సినిమాకు ప్రాణం వంటి దృశ్యాలను తీసేస్తే ఇక సినిమాలో ఏముంటుంది? అని ప్రశ్నిస్తున్నారు. నేను దేశభక్తితో తీసిన సినిమా తప్ప నేను దేశ ద్రోహిని కాను అని ఆవేదనతో చెబుతున్నారు. అవసరమైతే ఈ సమస్యపై కోర్టుకు వెళతానని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*