బహిరంగ మల విసర్జనకు…ఉచితి బియ్యానికి లింకు!

చదవేస్తే ఉన్న మతిపోయిందంటారు. అలాగేవుంది పుదిచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ పరిస్థితి. పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యానికి, బహిరంగ మల విసర్జను లింకు పెట్టారట ఆ మాజీ ఐపిఎస్‌ అధికారి. గ్రామాల్లో బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలించలేదట. దీంతో ఆమెకు ఒక ఆలోచన తట్టింది. రేషన్‌ షాపుల్లో ఉచితంగా ఇస్తున్న బియ్యం ఆపేస్తే…దారికొస్తారని భావించారు. అంతే మే 31 దాకా గడువు ఇచ్చి…అప్పటిలోపు స్థానిక అధికార యంత్రాగం నుంచి ఏ కుటుంబమైతే…బహిరంగ మల విసర్జన చేయడం లేదని సర్టిఫికెట్‌ తెస్తారో వాళ్లకు మాత్రమే ఉచిత బియ్యం ఇవ్వాలని ఆదేశించారట. బియ్యం ఇవ్వకుంటే అన్నం తినడం మానేస్తారని, అన్నం మానేస్తే మల విసర్జనకు పోవాల్సిన అవసరమే ఉండదని అనుకున్నారో ఏమోగానీ….ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

బహిరంగ మలవిసర్జన లేకుండా చేయడం మంచిదేగానీ…దాన్ని సాధించడానికి ఇది మార్గం కాదు. ప్రజలను చైతన్యపరాలి. అందరూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఉమ్మడిగా కృషి చేస్తే లక్ష్యం సాధించొచ్చు. అంతేగానీ…ఇదేమి నిర్ణయమని ప్రశ్నిస్తున్నారు జనం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*