మోడీ బాటలో బాబు!

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహానికి నిరసనగా ఈ నెల 20వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరాహార దీక్ష చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్లమెంటులో ప్రతిపక్షలు వ్యవహరించిన తీరుకు నిరసనగా అంటూ రెండు రోజుల క్రితమే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దీక్ష చేసిన విషయం తెలిసిందే. ప్రధాని దీక్షపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తప్పు చేసిన వాళ్లే దీక్ష చేస్తారా? అంటూ ప్రజలు ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పక్షాలు ఈ నెల 16న బంద్‌ నిర్వహిస్తుంటే…ఆ బంద్‌కు మద్దతు ప్రకటించని చంద్రబాబు, 20న దీక్ష చేస్తానని, 30న తిరుపతిలో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

ప్రత్యేక హోదా డిమాండు కోసం చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేయడంలో తప్పులేదుగానీ…ప్రతిపక్షాలు చేస్తున్న బంద్‌ను అదేదో దేశ ద్రోహ చర్యలాగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోడానికే ప్రతిపక్షాలు బంద్‌ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. తానొక్కడే నిజాయితీగా హోదా కోసం పోరాడుతున్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేసిన వారిపైన చంద్రబాబు ప్రభుత్వం కేసులు బనాయించింది. ఇప్పుడేమో బంద్‌ను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. అలాంటి బాబు దీక్ష చేస్తానని ప్రకటించడంపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. చంద్రబాబు దీక్షను కొంగజపంలా పోల్చారు వైసిపి అధినేత జగన్‌. మోడీ దీక్షనూ గొంగ జపంతోనే నెటిజన్లు పోల్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*