రాంగోపాల్‌ వర్మను ఇక పట్టలేమేమో..!

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మను ఆకాశానికి ఎత్తేశాడు ఓ సివిల్స్‌ విజేత. తనకు వర్మే తనకు స్ఫూర్తి అని చెబుతున్నాడు. తర్కబద్ధంగా ఎలా మాట్లాడాలో ఆయన ద్వారానే తెలుసుకున్నానని, అందుకే సివిల్స్‌ సాధించడమేగాదు…నిత్య జీవితంలో అన్ని పనులు సునాయాసంగా చేసుకోగలుగుతున్నానని అన్నారు. సివిల్స్‌లో 644వ ర్యాంకు సాధించి వరంగల్‌కు చెందిన అక్షయ్‌ మీడియాతో మాట్లాడుతూ…తాను రాంగోపాల్‌వర్మ సినిమాలే కాదు…ఆయన యూట్యూబ్‌లో పెట్టే ప్రతి వీడియోనూ చూస్తానని అన్నారు. లాజికల్‌గా ఎలా మాట్లాడాలో ఆయన్ను చూసే నేర్చుకున్నానని చెప్పారు. రాంగోపాల్‌ వర్మ ఎందరో తత్తవేత్తలను చదివారని, అందుకే ఆయన్ను చదివితే అందర్నీ చదివినట్లు అవుతుందని అన్నారు. ఆయన్ను నేరుగా కలుసుకోవాలని ఉందని, అయితే…ఆయనకంటే ఉన్నత స్థితికి చేరుకున్నాక కలుసుకుంటానని వెల్లడించారు.

askhay kumar

రాంగోపాల్‌ వర్మను అందరూ దూషస్తూ, విమర్శిస్తూవుంటే సివిల్స్‌ విజేత ఆయనే తనకు ప్రేరణ అని చెప్పడం విశేషమే. ఈ మధ్యకాలంలోనైతే వర్మ తీవ్రమైన దాడిని ఎదుర్కొన్నారు. శ్రీరెడ్డితో పవన్‌ను తిట్టచ్చిన తరువాత…ఆయన్ను సైకో అని, మానసిక రోగి అని, సమాజమంటే పట్టని వ్యక్తి అని, విఫల దర్శకుడని ఏవోవే మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఉదంతం తరువాత వర్మ గ్రాఫ్‌ బాగా పడిపోయిందనుకోవాలి. ఈ నేపథ్యంలో సివిల్స్‌ టాపర్‌ చెప్పిన మాటలు ఆయనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని చెప్పాలి. అందుకే…ఈ ఇంటర్వ్యూ చూసిన రాంగోపాల్‌ వర్మ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడట. తనను స్ఫూర్తిగా తీసుకుని ఒక యువకుడు సివిల్స్‌ సాధించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వర్మ ట్విట్టర్‌లో రాశారు. సాధారణంగా అభిమానులనూ ఆయన పెద్దగా పట్టించుకోరు. ఈ అభిమాని అభిమానానికి మాత్రం ముగ్దుడై స్పందించడారు. ఇదీ ఒక విశేషమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*