శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ ఛైర్మన్ గా శెట్టిపల్లి సురేష్, వైస్ ఛైర్మన్‌గా క్రిష్ణారెడ్డి

  శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఛైర్మన్ గా శెట్టిపల్లి సురేష్, వైస్ ఛైర్మన్ గా కిట్టుమేస్త్రీ(క్రిష్ణారెడ్డి) నియమితులయ్యారు. 
పట్టణంలోని కందన్ రైస్ మిల్లుకు చెందిన సురేష్ తండ్రి శెట్టిపల్లి క్రిష్ణయ్య గతంలో టౌన్ బ్యాంక్ ఛైర్మన్ గా పనిచేశారు. బ్యాంకు కష్టకాలంలో ఉన్నప్పుడు క్రిష్ణయ్య కృషి ఫలితంగానే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లినట్టు చెబుతారు. ప్రస్తుతం ఆయన వారసుడయిన సురేష్ ఛైర్మన్  అవడంతో బ్యాంకు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళుతుందని పురప్రజలు భావిస్తున్నారు. మరోవైపు అనుభవజ్ఞులు, సీనియర్ అయిన బుజ్జిమేస్త్రీని వైస్ ఛైర్మన్ గాను, సభ్యులను ఉత్సాహవంతులను నియమించడంతో బ్యాంకు మరింత అభివృద్ధి చెందుతుందనే చర్చ సాగుతోంది. ఈమేరకు జిఓకూడా విడుదల కావడంతో త్వరలోనే నూతన కమిటీ ప్రమాణస్వీకారం చేయనుంది.    
      - ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*