సాయి…మీసం ఇంకేమి తిప్పుతావులే..!

సినీ నటుడు, ఎందరో నటులకు స్వరసాయం అందించే ప్రఖ్యాత డబ్బింగ్‌ కళాకారుడు సాయికుమార్‌ కర్నాటకలో ఎన్నికల గోదాలోకి దిగి పరువుపోగొట్టుకున్నారు. దేశంలో చాలా మంది సినీనటులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దపెద్ద పదవుల్లో పని చేశారు. ఇప్పుడు తమిళనాడులో సినీనటులే చక్రం తిప్పుతున్నారు. సాయికుమార్‌ ఎన్నికల బరిలో దిగడం తప్పులేదు. అయితే సినీనటుడిగా తనకున్న పేరు ప్రతిష్టలకు భగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గెలవకపోవచ్చుగానీ… ఓటమి అయినా మర్యాదకరంగా ఉండేలా చూసుకోవాలి. బేగేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనకు నాలుగో స్థానం వచ్చింది. అదీ నాలుగు వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో డిపాజిట్లు కోల్పోయినట్లయింది. ఏం చేద్దాం…సినిమాలు వేరు…రాజకీయాలు వేరు. అక్కడ రాణించినవాళ్లంతా ఇక్కడా రాణించాలని లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*