అందరూ బయటకు రావాల్సిదే…

పవన్‌ కల్యాణ్‌ను దూషించిన తరువాత తలెత్తిన పరిణామాలతో ఒంటరిగా మిగిలి, కొన్ని రోజులు కనిపించకుండా పోయిందిన శ్రీరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి ఆమె ఏ టీవీ ఛానల్‌కూ వెళ్లలేదు. ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మాట్లాడారు. ఇప్పటి దాకా జరిగిన అన్ని విషయాలనూ పూసగుచ్చినట్లు వివరించారు. పవన్‌ను దూషించిన రోజు…’నేను ఒంటరినైపోయాను…ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది’ అని తీవ్ర కుంగుబాటుతో మాట్లాడిన ఆమె…ఈ ఫేస్‌బుక్‌ లైవ్‌లో చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు.

పవన్‌ కల్యాణ్‌ను మాదర్‌ చోద్‌ అని తిట్టడం వెనుక రాజకీయ పార్టీలు ఏవీ లేవని చెప్పారు. తాను పోరాటం చేస్తున్న క్యాస్టింగ్‌ కౌచ్‌పై సినీ ప్రముఖులు ఎవరూ మాట్లాడటం లేదన్న కోపంతో, ప్రముఖులందరూ స్పందిస్తారని రాంగోపాల్‌ వర్మ ఇచ్చిన సలహాతోనే తాను ఆ విధంగా మాట్లాడానని చెప్పారు. సురేష్‌బాబు కొడుకు అభిరామ్‌ను కాపాడటం కోసం డబ్బులు ఇవ్వజూపారాని, తీసుకోడానికి నిరాకరించడంతో రాంగోపాల్‌ వర్మ కుట్రపూరితంగా తనను రెచ్చగొట్టి ఇరికించారిన అన్నారు. అదేవిధంగా మెగా ఫ్యామిలీ కాంపౌండ్‌ నుంచి వచ్చిన అప్పారావు అనేక మంది అమ్మాయిలను వేధించారని, అలాంటి వ్యక్తి గురించి మెగా ఫ్యామిలీ స్పందించలేదని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని, ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. బాబు గోనినేని తనను వ్యభిచారిగా అభివర్ణించారని, ఆయనపై కేసు పెడతానని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*