అందుకు…బాబు మూడు నుంచి నాలుగేళ్ల జైల్లో ఉండాలి : జగన్‌ సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ ఓ పుస్తకాన్ని వైసిపి విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే… టిడిపి ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు చేసిన ఓ తప్పుకు మూడు నుంచి నాలుగేళ్లు జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. అవినీతి, విచారణకు సంబంధించి ఓ టివి ఛానల్‌ ఇంటర్వ్యూలో జగన్‌ చెప్పిన విషయాలు ధర్మచక్రం పాఠకుల కోసం…

జైలుకు పోతాడా, పోడా అన్నది ఆధారాలు, సాక్ష్యాలను బట్టి ఉంటుంది. నేను చిన్న ఉదాహరణ చెబుతా. రాజధాని పలానా చోట వస్తుందని చంద్రబాబునాయుడుకు తెలుసు. ప్రజలను మిస్లీడ్‌ చేస్తాడు. నూజివీడు దగ్గర వస్తుంది, ఇంకోచోట వస్తుందని మిస్లీడ్‌ చేశాడు. అధికారం చేపట్టాక డిసెంబరు దాకా ఎక్కడ అనేది చెప్పలేదు. మధ్య ఆరు నెలల కాలంలో ఆయన, ఆయన బినామీలు రాజధాని ఎక్కడ వస్తుందో అక్కడ రైతుల వద్ద నుంచి భూములు కొన్నారు. సాక్షాత్తు హెరిటేజ్‌ అనే ఆయన సొంత సంస్థ పేరిట కూడా 14 ఎకరాలు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత రాజధాని అక్కడే ఏర్పాటు చేశారు. దీనిని స్టాక్‌ మార్కెట్లో అయితే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారు. ఇందుకు శిక్ష మూడు నుంచి నాలుగేళ్లు జైలులో ఉండాల్సి వస్తుంది.  

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి రాజ్యాంగ రహస్యాలను వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోనని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక్కడ తాను, తన బినామీలు బాగుపడేదాని కోసం రాజ్యాంగ రహస్యాన్ని తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకున్న పరిస్థితి. దీనికి శిక్ష ఏమిటి? ఆధారాలతో సహా ఉన్నాయి. ఇటువంటివి అనేకం అక్కడ ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి దేవుడికి కూడా కోపం వస్తుంది. శిశుపాలుడికి కూడా 100 తప్పులు నిండిన తరువాత 101వ తప్పు చేస్తే దేవుడు మొట్టికాయలు వేశాడు. ఈయన చేసిన అన్యాయాలకు, అవినీతికి, అప్రజాస్వామిక పాలనకు కచ్చితంగా ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకసారి దేవుడు మొట్టికాయలు వేసి బుద్దిచెప్పే పరిస్థితి వస్తుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*