అందుకేనా….రమణ దీక్షితులపై అంత కోపం!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను ఆకస్మికంగా తొలిగించడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు బయపటడింది. బిజెపి జాతీయ అధ్యక్షులు ఈ నెల 11వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికి దర్శనం చేయించారు రమణ దీక్షితులు. అంతటితో ఆగలేదు….ఆయన్ను వకులామాత పోటులోకి తీసుకెళ్లారు. పోటును తవ్వేశారంటూ అక్కడ జరిగిన మార్పులను ఆయనకు వివరించారు. ఈ సమాచారం ప్రభుత్వానికీ చేరింది. బిజెపికి, డిడిపికి ఉప్పు నిప్పులాగా ఉన్న సమయంలో అమిత్‌షాను ప్రత్యేకంగా గౌరవించడమేగాక ఆలయంలోని పోటుకు తీసుకెళ్లడంపై అందరికీ కోపం వచ్చింది. అప్పుడే రమణ దీక్షితులపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇది జరిగింది 11వ తేదీ. ఐదు రోజుల తరువాత బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రమణ దీక్షితులను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించాలని, ఆయన్ను రిటైర్‌ చేయాలని నిర్ణయించారు. ఇంతకో అమిత్‌షాను పోటులోకి తీసుకెళ్లినట్లు ఎలా తెలసిందనేగా…రమణ దీక్షితులే ఓ ఇంగ్లీషు ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఎలాంటి తవ్వకాలూ జగలేదని, మరమ్మతులు మాత్రమే జరిగాయని పోటు కార్మికులు చెబుతుంటే…దీక్షితులు మాత్రం అక్కడ అడుగు కూడా తవ్వారని పునరుద్ఘాటిస్తున్నారు.

2 Comments

  1. Yes, he was miscarrying the opinion against the organisation, hence overwhelmed by showing to Amitshah. Doesnot he realise, what can be done by him rather than create a political agenda.

    From the words of Ramana dikshitulu, it reveals that he is the only person to run temple as per aagama and rest of all should obey him.

    He never allowed a normal devotee to see the Lord for more than a second whereas has he obtained any special sanction from Lord to take his family members to Gharbalaya? If it is so, with folded hands we pray him to accord such sanction for the normal devotee as each and every devotee equal for the Lord.

    After gone through the situation happened so far, an inquiry would definitely bring out the actual cause of the dispute and corrective action.

  2. ఏది ఏమైనా భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు….ఇది మంచిది కాదు…దేవదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. జాగ్రత్త..

Leave a Reply

Your email address will not be published.


*