అక్షింతలతో మొదలుపెట్టి… ఆరగింపులతో ముగించి…!

ఈ శనివారం బిగ్ బాస్ ఇంటిని సమీక్షించిన నాని…ఎవరి తప్పులు ఏమిటో ఎత్తిచూపుతూ…సరిదిద్దే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులు గుర్తించిని తప్పులనే నాని ప్రస్తావించారు. ప్రధానంగా ఈ వారం భాను, తేజస్విని, అమిత్ లకు అక్షింతలు వేశారు. మంచివాళ్లు… చెడువాళ్లు టాస్క్ లో కౌశల్ తనతో హద్దులుదాటి ప్రవర్తించారంటూ భాను గొడవచేసిన సంగతి తెలిసిందే. బాగున్నపుడు క్లోజ్ గా ఉంటూ… సంబంధాలు చెడినపుడు ఈ విధమైన ఆరోపణలు చేయడం తగదంటూ భానుకు హితవు చెప్పారు. అదేవిధంగా డాస్క్ లో మహిళలు ఉన్నపుడు కాస్త జాగ్రత్తగా మసలుకోవాలని, హద్దులు మరచిపోవద్దని ఇంటిలోని మగాళ్లకు సూచించారు. ఇక ఈ సందర్భంగా తేజస్వీ వ్యవహరించిన తీరునూ తప్పుపట్టారు. ఆమె గొడవను పెద్దది చేయడానికి ప్రయత్నించడాన్ని, కౌశల్ ను బద్నాం చేయడానికి చేసిన ప్రయత్నాలను ఎత్తిచూపారు. ఇక ఫోన్ టాస్క్ సందర్భంగా భానును నామినేషన్ నుంచి రక్షించడానికి ముందుగా సిద్ధపడి కొన్ని నిమిషాల వ్యవధిలోనే మాట మార్చిన అమిత్ ధోరణిని నాని ఎత్తిచేపారు. ఈ ఒక్క చర్యతో ఇన్ని రోజులు ఇన్ని రోజులు ప్రేక్షల్లో ఉన్న మంచి అభిప్రాయం పోగొట్టుకున్నారంటూ ముఖాన చెప్పేశారు. రోల్ రైడా కోసం తాను వారం మొత్తం ఫ్రూట్స్ మాత్రమే తినడానికి అంగీకరించడమే గాక…తాను నేమినేట్ అయ్యేందుకు ఒప్పుకున్న గణేష్ తీరును నాని విమర్శించారు. దీన్ని గణేష్ అమాయకత్వంగా అభివర్ణించారు.

ఈ ఎపిషోడ్ లో బాబుగోగినేని ప్రత్యేక దుస్తుల్లో చాలా ప్రత్యేకంగా కనిపించారు. ఇంటి సభ్యుల ప్రోత్సాహంతోనే తాను ఇలా అలంకరించుకున్ననని బాబు చెప్పారు. మీలో చాలా మార్పు కనిపిస్తోందంటూ బాబును నాని మెచ్చుకున్నారు. ఎవరో చెప్పే అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారని గోగినేనిపై నాని చేసిన కామెంట్ కు బాబు మంచి వివరణ ఇచ్చారు. మీకు 90 కెమెరాలు ఉండొచ్చు…నాకు ఉన్నది రెండు కళ్లు మాత్రమే…ఇక్కడ నాకున్న సమాచారం ఆధారంగా మాత్రమే నేను నిర్ణయాలు తీసుకోగలను…అని బాబు వివరించారు.

ఇక సునయన పూర్తిగా తనిష్ మీద ఆధారపడిపోయిందని నాని గుర్తించారు. ఇది ఇద్దరికీ మంచిదికాదన్నారు. సునయన తరపున కూడా తనిష్ మాట్లాడు తుండటాన్ని గుర్తుచేస్తూ…బయటకు వెళ్లిన తరువాత కూడా ఇలానే ఉండగలవా…అని నాని మందలించినట్లు చెప్పారు. దానికి తనిష్ ఏమో అని బదులివ్వడం విశేషం.

ఈవారం కెప్టెన్ గా ఎన్నికయిన గీతా మాధురిని అభినందించారు. అదేవిధంగా భాను గొడవ చేస్తున్నపుడు అదే టీంలో ఉన్నప్పటికీ గీత దృఢమైన అభిప్రాయంతో భాను తప్పును ఎత్తి చూపడాన్ని నాని మెచ్చుకున్నారు.

శనివారం గణేష్ పుట్టిన రోజు.‌‌ ముందుగా చివాట్లు పెట్టినా చివర్లో గణేష్ కోసం బర్త్ డే కేకు తెప్పించారు నాని. కేక్ కట్ చేయించారు. గణేష్ కోసం రోల్ రైడా ఓ రాప్ పాడారు. ఇది ఆకట్టుకుంది. వారమంతా ఫ్రూట్స్ మాత్రమే తింటూ నీరసించిపోతున్న గణేష్ కోసం…హాయిగా ఆరగించమంటూ బిరియాని తెప్పించారు నాని.

ఈ వారం ఎలిమినేషన్ లో దీప్తి, భాను, గణేష్ ఉన్నారు. ఇందులో ఎవరక్షితులో ఎవరో ఎలిమినేట్ అవుతారో ఆదివారం తెలుస్తుంది.

ఈవారం నాని కాస్త బాగా చేశారనిపించింది. క్లాసులు పీకినా హద్దులు దాటకుండా జాగ్రత్తపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*