అది నేరమేగదా…రమణ దీక్షితులు గారూ..!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గురించి ముఖ్యమంత్రి చంబ్రాబు నాయుడు విశాఖపట్నంలో జరిగిన ధర్మదీక్ష పోరాటంలో ముఖ్యమైన వ్యాఖ్య ఒకటి చేశారు. తనపైన విమర్శలు చేస్తున్న అర్చకుని ఇంట్లో దేవుడి పటాల పక్కనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఫొటో ఉండటాన్ని ప్రస్తావించారు. రమణ దీక్షితులు వెనుక వైసిసి, బిజెపి ఉన్నాయని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. దానికి రమణ దీక్షితులు ఇంట్లో వైఎస్‌ ఫొటో పెట్టుకోవడాన్ని నిదర్శనంగా చూపించారు ముఖ్యమంత్రి. సోషల్‌ మీడియాలోనూ ఆ ఫొటోలు పెట్టి రమణ దీక్షితులను విమర్శిస్తున్నారు.

రమణ దీక్షితులు చేసింది తప్పుకదే….రాజశేఖర్‌ రెడ్డి కేవలం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి సిఎం అయిన కొంత కాలానికే చనిపోయారు. చంద్రబాబు నాయుడు అలాకాదు…ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నాలుగేళ్ల నుంచి సిఎం. ఇంకో ఏడాది కూడా ఉంటారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెబుతున్నారు. రాజశేఖర్‌ రెడ్డి గొప్పా….చంద్రబాబు నాయుడు గొప్పా…పెట్టుకుంటే గిట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఫొటో పెట్టుకోవాలనిగానీ…రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టుకోవడం ఏమిటి? ఇది నేరం కాదా రమణ దీక్షితులూ…!

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*