అదుపు తప్పిన బాలకృష్ణ ప్రసంగం ….ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు

ధర్మ పోరాట దీక్షలో సినీనటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ప్రసంగించేటప్పుడు సహనం కోల్పోయారు. ప్రధాన మంత్రిని ఉద్దేశించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో రాయలేని భాషలో, టివీల్లో చెప్పలేని పదాల్లో మాట్లాడారు. దీనిపై దుమారం రేగే సూచనలు కనిపిస్తున్నాయి. వైసిపి సహకారంతో రాష్ట్రంలో ఏదో చేద్దామని బిజెపి అనుకుంటోందని…అని చెప్పేక్రమంలో….’శిఖండిని అడ్డం పెట్టుకుని….(కొ…జ్జ..)లాగా చేద్దామనుకుంటున్నాడు. నీకు ఇదే వార్నింగ్‌….మా సహనాన్ని పరీక్షించొద్దు’ అంటూ సంయమనం కోల్పోయి మాట్లాడారు. అక్కడక్కడా వాడిన హిందీ పదాల్లోనూ అభ్యంతరకరమైనవి ఉన్నాయి. టివిలు ఆయన ప్రసంగాన్ని ఎడిట్‌ చేసి ప్రసారం చేశాయి. లైవ్‌లో మాత్రం యథాతథంగా ప్రసారమయ్యాయి.

బాలకృష్ణ తరచూ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. గతంలో ఓ సినిమా ఫంక్షన్‌లో మహిళలను ఉద్ధేవించి దిగజారుడుగా మాట్లాడారు. ‘అమ్మాయి కనిపిస్తే ముద్దుయినా పెట్టాలి…కడుపైనా చేయాలి’ అంటూ మాట్లాడిన తీరుపైన విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. అదేవిధంగా తన వద్దకు వచ్చిన అభిమానుల చెంప పగలగొట్టడమూ వివాదాస్పదమయింది. ఆయన సినిమాలకు…వాస్తవ జీవితానికి తేడా తెలియకుండా వ్యవహరిస్తుంటారన్న విమర్శలు బాలకృష్ణపై ఉన్నాయి.

ఇదిలావుండగా….ధర్మదీక్ష సభ ఉపన్యాసంలో, భారీ పదబంధాలతో కొన్ని డైలాగులు పలికారు. అవి సభికులను ఆకట్టుకున్నాయి. అయితే…ఆ డైలాగులను వేదికపైన వెనున నుంచి ఎవరో ఫ్రాంటింగ్‌ చబుతున్నట్లు కొన్ని వీడియోల్లో రికార్డయింది. ఇది కొసమెరుపు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*