అదృష్టం తలుపుతట్టింది…రోజు కూలీ రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యారు…!

అదృష్టం వెతుక్కుంటూ వచ్చి ఆయన తలుపు తట్టింది. దీంతో రోజు కూలీ అయిన అయన రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయారు. ఊహించని అదృష్టానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే….

కేరళ రాష్ట్రం కర్నూరు ప్రాంతానికి చెందిన పొరునాన్ రాజన్ రెక్కాడితేగానీ డొక్కాడని దినకూలి. శ్రమించి ని చేతడంతో పాటు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్లు కొనేవారు. మొన్నటి క్రిస్మస్ సంసర్భంగా రూ.300తో లాటరీ టికెట్టు కొన్నారు. ఈ బంపర్ డ్రా ఫలితాలు రెండు రోజుల క్రితం వెలువడ్డాయి. ఇందులో రాజన్ కు మొదటి ఫ్రైజ్ వచ్చింది.‌ ఆ మొత్తం ఎంతో తెలుసా…రూ.12 కోట్లు.

తన అదృష్టానికి ఉబ్బితబ్బిబ్బవుతున్న రాజన్ ఒకటికి రెండుసార్లు తన టికెట్ నెంబరును చెక్ చేసుకుని, తనకే మొదటి బహుమతి వచ్చిందని నిర్థారించుకున్నారు. ఆపై టికెట్ ను బ్యాంకులో అందజేశారు. అన్ని పన్నులు పోను రూ.7 కోట్లకుపైగా వస్తుందని‌ బ్యాంకు అధికారులు చెప్పారు.

కాయకష్టం చేసే తనకు డబ్బు విలువ తెలుసునని, మనకు వచ్చిన‌ డబ్బును దుబారా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకుంటానని రాజన్ చెబుతున్నారు. ఆయనకు భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

…. ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*