అధిక వసూళ్లు… ధరల పట్టికలేని లగేజీ లాకర్లు

  • అనుమతి లేని షాపుల్లో అక్రమ వసూళ్లు
  • ముక్కంటి ఆలయంలో ఇదీ పరిస్థితి


ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

అధికారుల నిర్లక్ష్యం , పట్టించుకోకపోవడం కారణంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బంది గా మారుతోంది. ప్రయివేటు కాంట్రాక్టు వారు బోర్డులు ఏర్పాటు చేయలేదని ,అధికంగా వసూళ్లు చేస్తున్నారనే నెపంతో వారిని పక్కన పెట్టి దేవస్థానం వారే లగేజీ లాకర్లు నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ కూడా అదేవిధానం అవలంభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
బోర్డులు లేని లగేజీ లాకర్లు..


శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు బ్యాగులు, సెల్ ఫోన్లు, కెమెరాలు భధ్రపరిచేందుకు దేవస్థానం లగేజీ లాకర్లు ఏర్పాటు చేశారు . గతంలో ప్రయివేటు కాంట్రాక్టు వారు లగేజీ లాకర్లు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆలయం తరపున సెక్యూరిటీగార్డులు లగేజీ లాకర్లు వద్ద డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే నాలుగు గోపురాలు వద్ద లాకర్లు ఏర్పాటు చేశారు. బ్యాగు ,ఫోన్ కు 5 రూ.ల చొప్పున, కెమెరా కు 10రూ.ల చొప్పున భక్తులు నుంచి వసూళ్లు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రతి కౌంటర్ వద్ద ధరలు పట్టికలు ఏర్పాటు చేయాలి. అయితే మొదటి గేటు, నాల్గవ గేటు వద్ద మాత్రమే బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు 2,3 గేట్లు అయిన శివయ్య గోపురం, తిరుమంజనగోపురం వద్ద ధరలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఏవస్తువుకు ఎంత చెల్లించాలో తెలియక భక్తులు అవస్థలు పడుతున్నారు. తద్వారా భక్తుల నుంచి.అధికంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


అధిక వసూళ్ల పై ఆగ్రహం.
దేవస్థానం
ఆధ్వర్యంలో సెక్యూరిటీగార్డులు వసూళ్లు చేస్తున్న లగేజీ లాకర్ల వద్ద భక్తుల నుంచి అధికంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. బ్యాగు, సెల్ ఫోన్ కు ఒక్కోదానికి ఐదు రూ.లకు గాను పది రూ.చొప్పున వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు న్నాయి. ఇదే విషయమై గత రెండు రోజుల క్రితం ఇద్దరు సెక్యూరిటీగార్డులపై దేవస్థానం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి , మందలించి వదిలేసినట్లు సమాచారం.


అనధికార షాపులతో నష్టం
దేవస్థానం
సమీపంలో ఏర్పాటు చేసిఉన్న కొన్ని అనధికార షాపులు వలన దేవస్థానం కు నష్టం వాటిల్లుతోంది. శివయ్య గోపురం, బిక్షాల గోపురం సమీపంలో అనధికారికంగా పలు షాపులు వెలసిఉన్నాయి. వీరు ఆలయంలోకి వెళ్లే భక్తుల ను ముందుగానే అడ్డగించి లగేజీ అక్కడే పెట్టుకుని భక్తుల వద్ద వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా లగేజిల ద్వారా వచ్చే ఆదాయం దేవస్థానం కు కాకుండా ప్రయివేటు వ్యక్తులకు చేరుతుంది. దేవస్థానం అధికారులు ఇప్పటికైనా స్పంధించి లగేజీ లాకర్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ,అనధికార షాపులు తొలగించాలని పలువురు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*