అన్నా క్యాంటీన్ల కోసం వంటా వార్పుతో టిడిపి నిరసన

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ పిలుపుతో శ్రీకాళహస్తి పట్టణంలోని అన్న క్యాంటీన్ దగ్గర పట్టణ అధ్యక్షులు విజయ కుమార్ ఆధ్వర్యంలో వంట వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

తెలుగుదేశం ప్రభుత్వం 2014- 2019 వరకు పేదలకు అన్నం పెట్టె కార్యక్రమం తలపెట్టి నిత్యం పేదల ఆకలి తీర్చేదని, వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్న కాంటీన్లను మూసివేసిందని విజయ్ కుమార్‌ అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అన్న కాంటీన్లను తెరిచి పేదల ఆకలి తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం నాయకులే వంట చేసి అందరికీ ఆహారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంఠ రమేష్, తొట్టంబేడు మండల పార్టీ అధ్యక్షుడు గాలి మురళి నాయుడు, రేణిగుంట మండల పార్టీ అధ్యక్షుడు చిన్న రెడ్డి, ఏర్పేడు మండల పార్టీ అధ్యక్షుడు పొన్న రావు,శ్రీకాళహస్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచెయ్య నాయుడు, రాష్ట్ర బీసీ సెల్ గురువారెడ్డి, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ మిన్నల రవి, పట్టణ మహిళ అధ్యక్షురాలు రేణుక దేవి, ప్రసాద రావు, మల్లికార్జున గౌడ్, షాకిర్ అలీ, మునిరాజ యాదవ, బషీర్, పొల్లూరు శ్రీనివాసులు రెడ్డి, జీలని బాషా, వెంకటేష్ చౌదరి, ప్రకాష్ నాయుడు, తీర్థం వెంకటేశ్వరులు, కుమార్, బుజ్జి, కన్నవారం హరిబాబు, జమాల బాషా, రామకృష్ణ, అస్మత, యాదగిరి, సుబ్బయ్య, గుత్తా విజయ, ఆర్ముగం, రామచంద్రయ్య, గోపి, సుజిత్, లక్ష్మణ్,తెలుగు మహిళలు చక్రాల ఉష, రూషేంద్రమని, ధనమ్మ, పుష్పమ్మ, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*