అమ్మా జ్ఞానప్రసూనాంబ…నర్సింగ్‌ విద్యార్థిను గోడు కాస్త వినవమ్మా..!

  • వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

వారంతా నిరుపేద కుటుంబాలకు నుంచి వచ్చిన విద్యార్థులు…ప్రభుత్వం మంజూరు చేసే ఉపకారవేతనాలే వారికి ఆసరా….భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ అర్థిక ఇబ్బందుల కాఱంగా నర్సింగ్‌ విద్యను ఎంచుకున్నారు. అలాంటి పేద విద్యార్థుల పొట్టకొడుతున్నారు. ప్రశ్నించే విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే…’వాళ్లు ముదుర్లు..మీరే సర్దుకుపోండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు తప్ప…చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నర్సింగ్‌ చదువుతున్న అమ్మాయిలు జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తాకు ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా స్కిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు… జ్ఞానప్రసూనాంబ నర్సింగ్‌ కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ నర్సింగ్‌ కాలేజీ మొదట్లో కాసాగార్డెన్‌లో నిర్వహించేవారు. మూడేళ్ల క్రితం స్కిట్‌ ప్రాంగణంలోకి మార్చారు. ప్రస్తుతం కళాశాలలో 70 మంది విద్యార్థినులున్నారు. ఇందులో 30 మంది హాస్టల్‌లో ఉంటునాఉ. మిగిలినవారు డే స్కాలర్స్‌గా కళాశాలకు వస్తున్నారు.

ఉపకరవేతనాలు గోవిందా..: జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్‌ కళాశాలలోని 70 మంది విద్యార్థినుల్లో 54 మందికి ప్రభుత్వం స్కాలర్‌షిప్పు అందిస్తోంది. కొందరు మేనేజ్‌మెంట్‌ కోటా కింద చదువుకుంటున్నారు. ఉపకరావేతనాలు పొందుతున్న 53 మందిలో 30 మంది వసతి గృహంలో ఉంటున్నారు. హాస్టల్‌లో ఉంటున్న వారికి మంజూరయ్యే స్కాలర్‌షిప్పులో హాస్టల్‌ బిల్లుపోను మిగతాది వెనక్కి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం లేదు. హాస్టల్‌లో లేని వారికి పూర్తిమొత్తం స్కాలర్‌షిప్పు చెల్లించాలి. అదీ జరగడం లేదు. అసలు స్కాలర్‌షిప్పు ఎంత వస్తోందో కూడా తెలియడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని వేధిస్తున్నారు. ఇక ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బులకూ రశీదులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ఒక్కోసారి చెల్లించినా చెల్లించలేదంటూ విద్యార్థులతో సిబ్బంది వాదనకు దిగుతున్నారు. యాజమాన్యం అలక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందన్న విమర్శలున్నాయి.

వయసు దాటిపోయినా…: విద్యాశాఖ నిబంధనల ప్రకారం నర్సింగ్‌ కాలేజీల్లో 70 ఏళ్ల వయసు దాటిన వారు ఉద్యోగానికి అర్హులు కారు. అయితే ఇక్కడ మాత్రం 85 ఏళ్లు దాటిన మహిళ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఈమెను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని గతంలో ముక్కంటి ఆలయ ఈవోలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోయారు. ప్రిన్సిపాల్‌ బాధ్యతలు నిర్వర్తించాలంటే…నర్సింగ్‌ ఎంఎస్‌సి చదవి ఉండాలి. ఈ విద్యార్హత ప్రస్తుత ప్రిన్సిపాల్‌కు లేదు. ఒకవైపు ప్రభుత్వం నుంచి పింఛను తీసుకుంటూ మరోవైపు కళాశాల నుంచి జీతం తీసుకుంటున్నారు.

ప్రతిపాదనలు తిరస్కరణ : జ్ఞాన ప్రసూనాంబ కళాశాలలో ప్రస్తుతం జీఎన్‌ఎం కోర్సు వమాత్రమే నిర్వహిస్తున్నారు. బిఎస్సీ నర్సింగ్‌ కోరఉస నిర్వహించాలని మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి తన హయాంలో ఆదేశించారు. కళాశాలను పరిశీలించిన ఉన్నతాధికారులు…అర్హత కలిగిన ప్రిన్సిపాల్‌ లేరనే కారణాన్ని చూపుతూ బిఎస్సీ కోర్సు ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రిన్సిపాల్‌ను మార్చలేక విలువైన కోర్సును వదులుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్పత్రి కోసం అధిక ఫీజులు : నర్సింగ్‌ విద్యార్థినులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిక్షణ పొందడానికి ఒకొక్కరు రూ.500 చెల్లించాలి. అయితే ఈ కళాశాల నిర్వహకులు మాత్రం ఒకొక్కరి నుంచి రూ.1200 వంతున వసూలు చేస్తున్నారు. ఇదేమి ప్రశ్నించిన విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు.

యూట్యూబ్‌ చూస్తూ బోధన : జ్ఞాన ప్రసూనాంబిక నర్సింగ్‌ కళాశాలలో ఓ అధ్యాపకురాలు యూట్యూబ్‌ చూస్తూ…బోధన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాఠ్యపుస్తకాల్లోని అంశాలను పక్కనపెట్టి….ఇలా బోధిస్తున్నందున తమకు అర్థంకావడం లేదని విద్యార్థినులు వాపోతుఆన్నరు. ఈమె తీరుపై పలు పర్యాయాలు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయినా….ఆమెపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

ఈవోకు ఫిర్యాదు చేసినా… : నర్సింగ్‌ కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల కొందరు విద్యార్థులు రాతపూర్వకంగా శ్రీకాళహస్తి ఆలయ ఈవో శ్రీరామ రామస్వామికి ఫిర్యాదు చేశారు. అయితే….’వాళ్లు పెద్ద ముదుర్లు…మీరే సర్దుకుపోండి’ అని విద్యార్థుకు సర్దిచెప్పి పంపించారట. కళాశాలకు యాజమాన్యం అనదగిన ఈవోనే ఆ మాట చెప్పేసరికి చేసేది లేక వెనుదిరిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు, కలెక్టర్‌కు నారాయణ భరత్‌ గుప్తకు ఫిర్యాదు చేయడానికి విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

సమస్యలు పరిష్కరిస్తా : కళాశాలలో జరుగుతున్న అక్రమాలపైన విద్యార్థులకు తమకు ఫిర్యాదు చేశారని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని, సమ్యలను పరిష్కరిస్తానని శ్రీకాళహస్తి ఆలయ ఈవో శ్రీరామ రామస్వామి ధర్మచక్రం ప్రతినిధితో చెప్పారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*