అర్చకుల అగ్రహాన్ని చల్లబరిచే ప్రయత్నాలు

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కోపంతో అర్చకులకు మొత్తాన్ని ఇబ్బందిపెట్టేలా ప్రకటనలు చేసిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అర్చకత్వంలో 65 ఏళ్ల వయో పరిమితి నిబంధన టిటిడితో పాటు కొన్ని ప్రధాన ఆలయాల్లో పనిచేసే అర్చకులకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. మిగతా ఆలయాల్లో పనిచేసే ఎవరికీ వయో పరిమితి నిబంధన వర్తించని వివరణ ఇచ్చింది.

టిటిడిపై, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపైన ఆరోపణలు చేసిన రమణ దీక్షితులును ఉద్యోగం నుంచి తొలగించడం కోసం…ఎప్పటి నుంచో నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచిన 65 ఏళ్ల వయో పరిమితి నిబంధనను రాత్రికి రాత్రి బయటకు తీసిన టిటిడి….అంతే వేగంగా అమలు చేసింది. దీంతో అర్చకులకు వయో పరిమితి ఏమిటంటూ రాష్ట్ర వ్యాపితంగా అర్చకుల్లో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమయింది. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సౌందర్‌రాజన్‌ ‘లోకేష్‌కు ఏ అర్హత ఉందని మంత్రిని చేశారు…65 ఏళ్లు పైబడిన చంద్రబాబు ఏ విధంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు’ అని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న అర్చకుల నుంచి వచ్చింది. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి అర్చకులకు వయోపరిమితి ఎత్తేస్తామని ప్రకటించారు. అదేవిధంగా ధార్మిక పరిషత్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇది అర్చకుల్లో, బ్రాహ్మణుల్లో వైసిపి పట్ల సానుకూల వాతావరణం సృష్టిస్తున్నదన్న విషయాన్ని ప్రభుత్వం గమనించింది. అదేవిధంగా 65 ఏళ్ల నిబంధనతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని అర్థం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సంబంధిత అధికారులు, సంఘాల నేతలో సమావేశమై చర్చింరు. 65 ఏళ్ల నిబంధన టిటిడితో పాటు శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ వంటి ప్రధాన ఆలయల్లో పనిచేసే వారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు. జీవో 888 కింద పేస్కేళ్లు పొందుతున్న వారికి రిటైర్‌మెంట్‌ ఉంటుందని, వీరికి పెన్షన్‌ సదుపాయమూ ఉందని వివరించారు. త్వరలోనే ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ధార్మిక పరిషత్‌ చాలా కీలకమైనది. అర్చకులపై చర్యలు తీసుకోవాలంటే ఈ పరిషత్‌కు మాత్రమే అధికారం ఉంటుంది. ఆయా ఆలయాల్లోని ఈవోలకూ, ఇతర అధికారులకూ అధికారం ఉండదు. ఇన్నాళ్లు ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేయకుండా నాన్చుతూ వచ్చారు. ఏమైనా అర్చకుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*