అలిపిరి నడక మార్గంలో టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు

          తిరుమలకు వెళ్లే  మెట్ల మార్గంలో ఉన్న దుకాణాలను, మరుగుదొడ్లను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మరుగుదొడ్ల లోపల బయట బ్లీచింగ్ వేయాలని అధికారులను ఆదేశించారు.  

         నడక మార్గంలోని సౌకర్యాల గురించి పలువురు భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే తన కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.  ఆహార పదార్ధాలను శుచిగా ఉంచాలని, ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శ్రీశ్రీ ర‌విశంక‌ర్‌ను క‌లిసిన టిటిడి ఛైర్మ‌న్

         ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్‌ను ఆదివారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి తిరుప‌తిలోని ఒక హోట‌ళ్లో క‌లిశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

         ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ అంత‌ర్జాతీయంగా ప్ర‌సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక‌వేత్త అన్నారు. వారి ఉప‌న్యాసాలు వింటే మ‌న‌సు నిల‌క‌డ‌గా ఉంటుంద‌న్నారు. సుబ్బారెడ్డి తో పాటు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*