అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కార్పొరేషన్ లో విలీనం చేయవద్దని ధర్మారెడ్డికి వినతి పత్రం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో విలీనం చేయరాదని కోరుతూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది గురువారం టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఔట్సోర్సింగ్ సిబ్బంది అదనపు ఈవోను కలిశారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ చాలీచాల‌ని జీతాల‌తో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. APCOSలో విలీనం చేయ‌కుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని కోరారు.

ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసే చర్యలను యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టదన్నారు. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్, ఈవోల దృష్టికి తీసుకెళ్లి అవుట్సోర్సింగ్ సిబ్బందికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

అదనపు ఈఓను కలిసిన వారిలో సిఐటియు జిల్లా అధ్య‌క్షుడు ఎం.నాగార్జున, టిటిడి ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్టర్లు జి.వెంక‌టేశం, కాటా గుణశేఖర్, టిటిడి జెఏసి ఛైర్మ‌న్ జి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, మ‌హిళా ఉద్యోగ సంఘం నాయకులు ఎస్‌.క‌ల్ప‌న‌, ఇందిర, టిటిడి స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నాగ‌ర‌త్నం, కోశాధికారి శేఖర్‌, టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ అధ్య‌క్షుడు గోపి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు హరిప్రసాద్, నవీన్, రూప్ కుమార్, హరి, నిరంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*