అసలు కుట్రదారుడు లోకేష్‌ అంటున్న పవన్‌

శ్రీరెడ్డి వివాదంలో అనూహ్య మలుపు తిరిగింది. శ్రీరెడ్డి వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఉందంటూ వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదని ఈ మలుపుతో తేలిపోయింది. ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు తెరపైకి వచ్చింది. లోకేష్‌ అమరావతిలో సెక్రెటరియేట్‌లో కూర్చుని తన స్నేహితుడు రాజేష్‌ , సినీ దర్శకుడు వర్మతో కలిసి తనపై కుట్ర చేస్తన్నారని ట్విట్టర్‌ ద్వారా ధ్వజమెత్తారు. ఆరు నెలలుగా తనపై కుట్రలు చేస్తూ దీక్షలకు ఆహ్వానిస్తారా? అని నిలదీశారు. తనకు సంబంధం లేని విషయాలను తనకు చుట్టుడతూ….అభాసుపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి తన తల్లినీ నానా విధాలుగా మాట్లాడారని, తల్లి గౌరవాన్ని కాపాడుకోలేని తాను చనిపోయినా మంచిదని ఆవేదన చెందారు. కొన్ని మీడియా సంస్థల సహకారంతో చూపించిందే చూపిస్తే తనపై అభాండాలు మోపుతున్నారని పేర్కొన్నారు. పవన్‌ను తిట్టడానికి కారణం తానేనని, తప్పంతా తనదేనని రాంగోపాల్‌ వర్మ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పవన్‌ ఇలాంటి ట్విట్లు చేశారు. శ్రీరెడ్డి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని వైసిపి స్పష్టంగా ప్రకటించింది. ఇప్పటి దాకా శ్రీరెడ్డి వెనుక వైసిపి ఉందని అందరూ నమ్ముతూ వచ్చారు. పవన్‌ ప్రకటనతో ఒక్కసారిగా లోకేష్‌ ముద్దాయిగా నిలబడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*