ఆకాశరామన్న ఉత్తరానికి ఆకాశమంత ప్రాధాన్యత…

తనకు, తన కుటుంబానికి రక్షణ లేదని, కేంద్ర ప్రభుత్వమే తనకు రక్షణ కల్పించాని కోరుతూ ఎన్నిక కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కేంద్ర హోం శాఖకు రాసినట్లు చెబుతున్న ఓ లేఖ సోషల్‌ మీడియాలో బుధవారం చక్కర్లు కొట్టింది. కొంత సేపటికి అది ఫేక్‌ లేఖంటూ వార్తలొచ్చాయి ఈ లేఖను తాను రాశాననిగానీ రాయలేదని గానీ రమేష్‌ కుమార్‌ స్పష్టత ఇవ్వలేదు. తాను రాశానని స్పష్టత ఇచ్చేదాకా ఆ లేఖకు విలువ‌ ఉండదు. రమేష్‌ కుమార్‌ పేరుతో రాసిన ఆకాశరామన్న ఉత్తరంగానే భావించాలి. అయితే అటువంటి ఆకాశరామన్న లేఖకు….ఆకాశమంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించాయి తెలుగుదేశం అనుకూ పత్రికు.

సాధారణంగా ఆకాశరామన్న ఉత్తరాల‌కు మీడియా ప్రాధాన్యత ఇవ్వదు. పాఠకుల‌కు సమాచారం తెలియడం కోసం ఒక చిన్న వార్తగా ఇచ్చేసి వదిలేస్తాయి. ఈ లేఖ విషయంలో అర్ధ పేజీ కేటాయించి  ప్రతి అక్షరాన్ని ప్రచురించాయి. అదే వార్తలో ఈ లేఖ తాను రాసినట్లుగా రమేష్‌ కుమార్‌ నిర్ధారించలేదు అనే మాటను కూడా రాశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఏ తరహా పాత్రికేయమో ఆ పత్రిక సంపాదకుకే తెలియాలి.

ఇందులో ప్రధానంగా కనిపించే అంశం ఒకటే….రమేష్‌ కుమార్‌ ఆ లేఖ రాశాడా లేదా అనేది అవసరం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రచారం జనంలోకి వెళ్లాలి. అందుకే రమేష్‌ కుమార్‌ పేరు ఉపయోగపడాలి. అందుకే ఆకాశ రామన్న ఉత్తరం అయినప్పటికీ…అంతటి ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించారు.

ఒకవేళ నిమ్మగడ్డ రమేష్‌ కుమారే లేఖ రాసివుంటే…ఆయన ఆమాట చెప్పాలి. అటువంటి లేఖను హోంశాఖకు అది మీడియాకు ఎలా లీక్‌ అయిందనేది ప్రశ్న. హోంశాఖకు రాసిన లేఖను ఓ ఉన్నతాధికారి ఈ విధంగా బటయకు లీక్‌ చేయవచ్చనా అనే ప్రశ్న కూడా వస్తుంది.

ఈ పరిస్థితుల్లో ఆ లేఖను తాను రాసిందీ లేనిదీ చెప్పాల్సిన బాధ్యత ఆయనపైన ఉంది. తాను రాయకుంటే….పోలీసుకు ఫిర్యాదు చేయాలి. లేఖను ప్రచారంలో పెట్టిన వారిని పట్టుకోమని చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*