యుద్ధానికి సిద్ధమంటున్న టిటిడి ఉద్యోగులు ! ఆగస్ట్ 16 నుండి ప్రత్యక్ష ఆందోళన!

తమ సమస్యల పరిష్కారం కోసం టిటిడి ఉద్యోగులు ఆగస్టు 16వ తేదీ నుండి ప్రత్యక్ష ఆందోళనకు దిగనున్నారు. సోమవారం పరిపాలనా భవనం‌ వద్ద సమావేశమైన ఉద్యోగులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25 న తమ డిమాండ్లతో కూడిన నోటీసును ఈవోకు ఇవ్వనున్నారు. ఆగస్టు 15 వ తేదీలోపు సమస్యలు పరిష్కరిచకుంటే 16 నుండి ఆందోళనకు దిగుతామని ఈవోకు స్పష్టం చేయనున్నారు.

దశలవారీగా చేపట్టనున్న ఉద్యమంలో భాగంగా ఆగస్టు ఒకటిన ప్రచార కరపత్రం విడుదల చేస్తారు. 2వ తేదీ నుండి ప్రతి ఉద్యోగినీ కలిసి, కరపత్రం అందజేసి, సంతకాలు సేకరించనున్నారు. 8వ తేదీన అన్ని సంఘాల నేతలు సమావేశమై ఉమ్మడి కార్యాచరణ కమిటీ – జెఏసి ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో నే ఉద్యమం నిర్వహించనున్నారు.

గతంలోనూ జెఏసి ఏర్పాటు చేసుకుని పోరాడిన ఉదంతాలున్నాయి. ఎవరికెవరు‌ విడిగా పోరాడితే విజయం సాధించే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాల వంటి తీవ్రమైన సమస్యలూ ఉన్నాయి. సంఘాల మధ్య ఉన్న విభేదాలే అధికారుల నిర్లక్ష్యానికి ఆలంబనగా మారుతున్నాయి. ఉద్యోగులను‌ అధికారులు అసలు ఖాతరు చేయడం లేదు. దీన్ని అందరూ గుర్తించారు. అందుకే సంఘాలకు అతీతంగా నాయకులు ఏకమవుతున్నారు. యుద్ధానికి సిద్ధమని, ఈసారి సమస్యలపై అమీతుమీ తేల్చుకుంటామని నాయకులు దృఢ నిశ్చయంతో చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*