ఆటో డ్రైవర్లకు చేయూత..! సరుకుల పంపిణీ..!

తిరుపతి : బండి చక్రాలు నడిపిస్తే కానీ బతుకుబండి నడపించలేని ఆటో డ్రైవర్లు కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి అలగాని ఆనంద్ బాబు స్థానిక సుందరయ్యనగర్ లోని ఆటో డ్రైవర్ కుటుంబాలకు బియ్యం, కూరగాయలు వితరణ చేసి తన ఉదారతను చాటుకున్నారు..గతంలో పలు వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు తనవంతు సాయంగా ఈయన నిత్యావసరాలు పంపిణీ చేసారు..ఈ కార్యక్రమంలో మహేష్, అంజన్ కుమార్, జ్యోతిబాబు, చంద్రబాబు, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*