ఆనందంగా ఆత్మహత్య చేసుకున్నారు!

ప్రాణమంటే ఎవరికైనా తీపి. ప్రాణం పోతుందని తెలిస్తే తట్టుకోవడం అంత తేలికకాదు. ఆత్మహత్య చేసుకునేవాళ్లకూ బతకాలన్న కోరిక ఉంటుంది. అయినా తమముందున్న కష్టాలను ఎదుర్కోలేక ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అయితే…ఆయన మాత్రం సంతోషంగా ఆత్మహత్య చేసుకున్నారు. నేను రేపు చచ్చిపోతాను అని విలేకరులకు చెప్పి మరీ ప్రాణాలు విడిచారు. ఇంతకీ విషయం ఏమంటే….డేవిడ్‌ గూడాల్‌ అనే శాస్త్రవేత్త వయసు 104 ఏళ్లు. ఆస్ట్రేలియాలో ఉండేవారు. 104 ఏళ్ల జీవితం ఆయనకు ఎంతో బోరుగా అనిపించింది. వయసు పెరిగేకొద్దీ తన జీవనంలో నాణ్యత తగ్గిపోతున్నట్లు అనిపించింది. అందుకే ఇక జీవితాన్ని చాలించాలని అనుకున్నాడు. బలవంతంగా ప్రాణాలు వదలాని నిర్ణయించుకున్నాడు. అందుకు ఆస్ట్రేలియాలోని చట్టాలు అనుమతించలేదు. అందుకే ఆయన స్విస్టర్లాండ్‌కు బయలుదేరారు. ఆత్మహత్య చేసుకోడానికే తాను అక్కడికి వెళుతున్నట్లు బంధువులకు, కుటుంబ సభ్యులకు చెప్పి మరీ వెళ్లారు. అక్కడ ఓ సంస్థ సహకారంతో ప్రమాదకర రసాయనాన్ని ఒంటిలోకి ఎక్కించుకుని తుదిశ్వాస విడిచారు. దీనికి ముందురోజే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి…’రేపు నేను ఆనందంగా ప్రాణాలు విడవాలనుకుంటున్నాను’ అని చెప్పారట. చెప్పిన విధంగానే గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కన్నుమూశారు. స్విట్జర్లాండ్‌లో ఆత్మహత్య నేరం కాదు. అందుకే ఆయన అంతదూరం వెళ్లారు. ప్రపంచంలో ఆనందంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఈ శాస్త్రవేత్త ఒకరే ఏమో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*