ఆయన (వైఎస్) నా గాజులతో‌ ఆడుకునేవారు…వైఎస్ విజయమ్మ

నాలో, నాతో వైఎస్ఆర్ పుస్తకంలో వైఎస్ విజయమ్మ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అటు రాజకీయ జీవిత, ఇటు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని‌ సంగతులు ఎన్నో చెప్పారు. వ్యక్తగత జీవితానికి సంబంధించి కొన్ని ఆ పుస్తకంలోని కొన్ని హైలెట్స్….

  • మా పెళ్లి కార్డులో నా పేరు రాజేశ్వరి‌ అని ఉంటుంది. జాతకాలు ఏవో కుదరక అలా పేరు మార్చి వేశారు. నన్ను ఎప్పుడూ, ఎవరూ‌‌ రాజేశ్వరి‌ అని పిలిచింది లేదు.
  • జగన్ ని నేను సన్నీ అని పిలిస్తే, ఆయన నాన్నా, నాన్నా సన్నీ అని పిలిచేవారు. షర్మలను నేను అమ్ములు అని పిలిస్తే, ఆయన పాప్స్, పాపా అని పిలిచేవారు.
  • ఎప్పుడూ ఎవరికీ ఏమీ తెచ్చే అలవాటు లేని‌ ఆయన, ఒకసారి ఢిల్లీ నుంచి షర్మిలకు చెప్పులు తెచ్చారు. అవి షర్మిల కాలు సైజులో సగం ఉన్నాయి. ఎందుకండీ ఇలాంటివి తెచ్చారంటే…ఇవి పాపకు సరిపోవా…అప్పుడే అంత పెద్దదయిందా షర్మీ అన్నారు.
  • నీ సేవలు పార్టీకి కావాలి అని రాజీవ్ గాంధీ చెప్పారట. ఆంధ్రప్రదేశ్ లో ఏ రాయిని అడిగినా నీ పేరే చెబుతుంది అని‌ రాజీవ్ గాంధీ అన్నారట. ఈ మాటలు ఆయనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అని, రాజీవ్ గాంధీని జెంటిల్మెన్ అనేవారు.
  • ఆయన మీసాలు ఉంటేనే రాజసంగా కనిపిస్తారు. ఫస్ట్ టైం ఎంపి అయినపుడు మీసాలు కొంచెం తగ్గించారని కొట్లాడాను. మగాళ్లకు ఉండాల్సిందే మీసాలు…వాటిని‌ తగ్గిస్తే ఎలా అంటే…ఇప్పుడేం తక్కువయింది…బాగానే ఉన్నాను కదా అన్నారు. సిఎం అయిన తరువాత కూడా మీసాలు కొంచెం తగ్గించారు.
  • ఆయనకు నేను పెద్ద బొట్టు పెట్టుకున్నా, చేతి నిండా గాజులు వేసుకున్నా ఇష్టం. ఇద్దరమే ఉన్నపుడు నా గాజులతో ఆడుకునేవారు.
  • ఈయనకు ఫొటోలు దిగడం అసలు ఇష్టం ఉండేదికాదు. ఫంక్షన్లపుడు తప్పదన్నట్లు ఫొటోలు దిగేవారు.
  • ఆయన రోజువారీ వేసుకునే బట్టలు నేనే కొనేదాన్ని. సూటు బూటు వంటివి షర్మిలా కొనేది.
  • నేను ఏమి వేసుకున్నానో, ఎలా వున్నానో ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు…షర్మిల ఏ కమ్మలు వేసుకుంది, ఏ డ్రెస్ వేసుకుంది అన్నీ గమనించేవారు. నాకు ఏ రోజూ కాంప్లిమెంట్ ఇవ్వని ఆయన…షర్మిలకు మాత్రం…భలే బాగుంది పాపా అని చెప్పేవారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*