ఆశ్చర్యం… అచ్చెన్న, జెసి రగిలిపోతుంటే…. కూల్‌గా చంద్రబాబు!

Nara Chandrababu Naidu

ఈఎస్‌ఐ కుంబభకోణంలో అరెస్టయి, ప్రస్తుతం అనారోగ్య కారణంగా గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్నెన్నాయుడిని పరామర్శిం చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. న్యాయమూర్తి అనుమతి లేనిదే లోనికి అనుతించబోమని పోలీసులు చెప్పడంతో చంద్రబాబు వెనుదిరిగారు. ఈ సందర్భంగా కొంతసేపు మీడియాతో మాట్లాడారు.

ఇటువంటి సమయాల్లో చంద్రబాబు చాలా ఆవేశంగా, ఊగిపోతూ మాట్లాడతారు. అయితే….ఇప్పుడు మాత్రం ఆయన చాలా కూల్‌గా మాట్లాడారు. ఎక్కడా పరుషమైన పదాలు వాడలేదు. తప్పును ఎత్తిచూపితే సరిచేసుకోవాలి తప్ప ఈ విధంగా వేధించడం సరికాదన్నారు.  అచ్నెన్నాయుడి కుటుంబం మూడు దశాబ్దాకుపైగా టిడిపితో ఉందని, ఆ కుటుంబానికి ఎంతో ప్రతిష్ట ఉందని, ఆ ప్రతిష్ట దెబ్బతినేలా ప్రభుత్వం చేయడం బాధాకరమన్నారు. మాట్లాడినంత చేపూ ఇటువంటి మాటలే తప్ప…. ఆయనలో ఆగ్రహం, ఆవేశం కనిపించలేదు. మామూలుగా ఉన్మాది, రాక్షసుడు, ఆర్థిక నేరగాడు, నేరస్వభావి వంటి పదాలతో జగన్‌పై విరుచుకుపడే బాబు…చాలా నెమ్మదిగా మాట్లాడి ముగించం ఆశ్చర్యం కలిగించింది.

పోలీసులు లోనికి అనుమతించకుంటే ప్రతిఘటించను కూడా లేదు. ఆస్పత్రి గేటు ముందు బైఠాయించి హైడ్రామా క్రియేట్‌ చేస్తారని మీడియా ప్రతినిధులూ భావించారు. ఆయన మాత్రం….ఆవేవీ లేకుండా వెనుదిరిగారు. ఇది చంద్రబాబులో వచ్చిన మార్పు అనుకోవాలా? లేక జగన్‌ను రెచ్చగొడితే మరింత రెచ్చిపోయి, ఇంకొందరిని అరెస్టు చేస్తారని భయపడ్డా రోగానీ….ఆస్పత్రి వద్ద ఆయనలో స్పష్టమైన మార్పు కనిపించింది. అరెస్టులతో రగిలిపోతున్న అచ్చెన్నాయుడు, జెసి బ్రదర్స్ చంద్రబాబు తీరును గమనిస్తే మరింతగా రగిలిపోవడం ఖాయం. -ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*