ఆశ్చర్యం..ఏమయింది ఈనాడుకు..!

ఈనాడు దినపత్రిక ఈ రోజు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ వార్తను పతాక శీర్షికన ప్రచురించింది. కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన…జన్‌ ఆక్రోశ్‌ సభ వార్తకు అత్యత ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవల కాలంలో రాహుల్‌ గాంధీ వార్తకు ఇంతకు ప్రాముఖ్యత చూడలేదు. సాధారణంగా మోడీ ఎక్కడ మాట్లాడినా, ఏమి మాట్లాడినా….చేతులు ముందుకు చూపుతున్న ఫొటోలోనే, చెయ్యి ముందుకు చాచిన ఫొటోనే భారీగా వేసి, ఓ పది సబ్‌ హెడ్డింగ్స్‌ పెట్టి వార్త వేసేవారు. ఈరోజు రాహుల్‌ గాంధీ వార్తను ఆదే తరహాలో వేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సిపిఎం అభిలభారత మహాసభల వార్తకూ ఎవరూ ఊహించనంత ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి పేజీ పతాక శీర్షికలో పెద్ద ఫొటోతో దాదాపు సగం పేజీ కేటాయించారు. లోపల ఒక పేజీ వార్తలు వేశారు. ఈనాడు దినపత్రికలో ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందనేది పాఠలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో ఆ పత్రిక బిజెపికి బాకాగా మారిందన్న విమర్శలు వచ్చాయి. తెలుగుదేశంకు అనుకూలంగా ఉంటుందన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. వైసిపికి, కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేకమన్న భావన పాఠకుల్లో ఉంది. ఆ మధ్య జగన్‌ వార్తలను మొదటి పేజీలో ప్రచురించే సరికి జనం విస్తుపోయారు. అది కొంతకాలం నడిచింది. మళ్లీ ఈ మధ్య జగన్‌ వార్తలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఢిల్లీలో వైసిపి ఎంపిలు నిరాహార దీక్షుల చేసినా పెద్దగా పట్టించుకోలేదు. వైసిపి ఎంపిల రాజీనామా వార్తలకూ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈరోజు (30.04.2018) తిరుపతిలో టిటిడిపి ధర్మపోరాట దీక్ష, విశాఖలో వైసిపి దీక్ష ఉన్నప్పటికీ…టిటిడి దీక్ష వార్తకు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చారు. వైసిపి అలాంటి దీక్ష ఒకటి చేస్తున్నట్లు ఎక్కడా వార్తే కనిపించలేదు. ఒక్కోసారి ఈనాడు ప్రాధాన్యతలు అనూహ్యంగా ఉంటాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*