ఆ తీర్పును ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌గ‌ల‌దా..?

తెలంగాణ‌ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకి రావాల‌నుకుంటున్న వారికి స‌రిహ‌ద్దుల్లోనే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అవ‌స‌ర‌మైన వారిని క్వారంటైన్ కు, మిగ‌త‌వారిని హోం ఐసోలేష‌న్‌కు పంపించాల‌ని పంపించాల‌ని రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. బిజెపి నేత ఒక‌రు వేసిన కేసులో ఈ తీర్పును కోర్టు వెలువ‌రిచింది. ఈ తీర్పు వ‌ల్ల కొంద‌రికి మేలు జ‌రుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే… తీర్పును జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంత‌వర‌కు అమ‌లు చేయ‌గ‌ల‌ద‌న్న‌ది ప్ర‌శ్న‌.

కోరానా ప‌రీక్ష‌లు చేయాలంటే….ఖ‌రీదు మాత్ర‌మే కాదు. ప‌రీక్ష‌లు చేసే లాబ్‌లో అన్నిచోట్లా అందుబాటులో లేవు. అంతేకాకుండా  కిట్స్ కూడా కాలిన‌న్ని ప్ర‌భుత్వం వ‌ద్ద లేవు. ఈ కార‌ణంగానే అంద‌ర‌కి కోరానా ప‌రీక్ష‌లు చేయ‌డం లేదు. ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డితే….అటువంటి వారికి మాత్ర‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హింస్తున్నారు. ఆ ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌స్తే వైద్యం అందిస్తున్నారు.  అదీ ప‌రీక్ష ఫ‌లితాలు రావ‌డానికి దాదాపు ఒక రోజు స‌మ‌యం ప‌డుతోంది. గ‌తంలో పూనేలోని ల్యాబ్‌కు పంపించి ప‌రీక్ష చేసేవారు. ఇప్ప‌డు తిరుప‌తి స్విమ్స్ వంటి చోట్ల క‌రోనా ప‌రీక్షా కేంద్రాలు నెల‌కొల్పిన‌ప్ప‌టికీ….తుది ఫ‌లితాల కోసం మ‌ళ్లీ పూనేకు పంపుతున్నారు. ఇదంతా జ‌ర‌గ‌డానికి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతోంది. ప‌రీక్ష‌ల్లో జ‌రుగుతున్న జాప్యాన్ని నివారించ‌డం కోస‌మే ప్ర‌భుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల‌కు ప‌రీక్ష‌ల అనుమ‌తి ఇవ్వ‌డం, ప‌రీక్ష‌కు అవ‌స‌ర‌మైన కిట్లకు విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవ‌డం వంటి చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం ఉప‌క్ర‌మించింది.

ఈ ప‌రిస్థితుల్లో….క‌రోనా ల‌క్ష‌ణాలున్నా లేకున్నా ప్ర‌తి ఒక్క‌రికీ టెస్ట్ చేయాల‌న్న ఆలోచ‌న ప్ర‌భుత్వానికి ఉన్నా ఆచ‌ర‌ణ‌లో సాధ్యంకాని ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ఎందుకంటే….అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్ల‌ను విచ‌క్ష‌ణా ర‌హితంగా వాడేస్తే…రేపు వ్యాధి తీవ్ర‌మైన‌పుడు….కిట్ల కొర‌త ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది. అది మ‌రింత దారుణ ప‌రిస్థితుల‌కు దారి తీయ‌వ‌చ్చు. ఈ ప‌రిస్థతుల్లో కోర్టు తీర్పును ప్ర‌భుత్వం ఏవిధంగా, ఎంత‌వ‌ర‌కు అమ‌లు చేస్తుందో చూడాలి. ఆచ‌ర‌ణ‌లో ఎదురయ్యే స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తూ అదే కోర్టులో రివ్వ్యూ పిటిష‌న్ వేస్తుందా లేక ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తుందా లేక సాధ్య‌మైన మేర తీర్పును అమ‌లు చేయ‌డానికి పూనుకుంటుందా అనేది వేచి చూడాలి.

వివిధ కారణాలవల్ల హైదరాబాద్లో ఉంటూ రాష్ట్రానికి రావడానికి యత్నించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించి సరిహద్దులోనే ఆపేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగిసేదాకా హైదరాబాద్ లోనే ఉండాలని‌ జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో వివాదం కోర్టుకు చేరింది. అటువంటి తీర్పు వెలువడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*