ఆ పత్రికకు పూనకం…జిల్లేడు కొమ్మతో సోషల్ మీడియా దెబ్బలు..!

తెలుగులో కొన్ని దశాబ్దాలుగా అగ్రశ్రేణి పత్రికగా విరాజిల్లుతున్న ఒక దినపత్రిక, తాను పైకెత్తాలనుకున్న అంశానికి‌ అత్యంత ప్రధాన్యత ఇస్తుంది. ఇష్టంలేని అంశాన్ని అగాధంలోకి తొక్కేస్తుంది. ఇది నామాట కాదు. అదే పత్రికలో దీర్ఘకాలం పనిచేసిన జర్నలిస్టులు చెప్పేమాట.

ఒకప్పుడు… ఆ పత్రికకు పోటీగా తయారైన ఉదయం దినపత్రిక యాజమాన్యాన్ని దెబ్బ తీయడానికి (అప్పట్లో ‌ఉదయం పత్రికను మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం) మద్య నిషేధ ఉద్యమానికి చెప్పరానంత మద్దతు ఇచ్చింది. ఆ ఉద్యమానికి ఊపునిచ్చేందుకు…పది మందితో జరిగే కార్యక్రమానికీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించేది. ఒక్కోసారి ఎక్కవ జనాన్ని చూపించేందుకు…సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్న జనం ఫొటోలు తీసి, ఉద్యమ ఫొటోలతో‌ అతికించి ప్రచురించేదన్న ప్రచారం ఉంది.

ఇప్పుడు ఇదంతా ఎందమీడియాఅమరావతి రైతుల ఉద్యమానికీ అదే రకమైన ప్రాధాన్యత ఇస్తోంది.‌ ఈ ఉద్యమం మొదలై 200 రోజులైన సందర్భంగా చేపట్టిన ఆందోళనలు నామమాత్రంగా జరిగినా… ఈ‌ పత్రిక ఎటువంటి ప్రయారిటీ ఇచ్చిందో సవివరంగా విశ్లేషించారు ఔత్సాహికులు. ‌ఆ పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.‌ ఆ పోస్టు సారాంశం మీ కోసం…


***** పేపర్ చూడండి …

అమరావతి గురించి ఏకంగా మూడు మెయిన్ పేజీలలో హోరెత్తించారు. కానీ అదే ఉద్యమం ఎలా నవ్వులు పాలవుతుందో చెప్పకనే చెప్తుంది .

మొదటి పేజీ

రాజధాని ఉన్న రాయపూడి గ్రామంలో కేవలం 6 గురు ధర్నా చేస్తున్న ఫోటో మొదటి పేజీలో ప్రధాన వార్త . ఇంకో మూలాన అమెరికాలో నిరసన తెల్పుతున్న ఫొటో ..దానిలో సరిగ్గా 19 మంది ఉన్నారు .

దీనర్థం రాజధాని ఉన్న రాయపూడి కంటే అమెరికాలోనే అమరావతి కోరుకొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారన్న మాట . బహుశా ఆ 19 మంది కూడా అమెరికాలో డాలర్లు సంపాదించి బాబును నమ్ముకొని ఇక్కడ పొలాలు కొని ఉంటారు . అదే మెయిన్ పేజీలో యధావిధిగా బాబుగారి డైలీ పంచాంగం .

రెండవపేజీ

రెండవ పేజీ మొత్తం అమరావతికే కేటాయించాడు . ఊరూరా దీక్షలు పేరుతో మొత్తం 7 ఫోటోలు అచ్చేసాడు . అందులో ఒకటి చినబాబుది మరొకటి పెదబాబుది .

అదే పేజీలో మిగిలిన ఫోటోలు గమనించండి . ఒక ఫొటోలో ఒక్కడే ( రైల్వేకోడూరు ఇంచార్జి కొరడాతో కొట్టుకొంటున్న ఫోటో , ఇతను దివంగత టీడీపీ ఆర్టిస్ట్ శివప్రసాద్ అల్లుడు ) .

ఇంకో ఫొటోలో ముగ్గురు లేడీస్ . మరో ఫోటో పోలీసులుది . మిగిలిన రెండు ఫోటోలలో ఒక చోట పదిహేను ఇంకో చోట 20 మంది ఉన్నారు .

రాజధాని ప్రాంతంలో మొత్తం ఉన్నది దగ్గర దగ్గర 40 గ్రామాలు. చినబాబు, పెదబాబు, రైల్వేకోడూరు కొరడా , పోలీసుల ఫోటో తీసేస్తే ఇక మిగిలిన రెండు ఫోటోలు రెండు గ్రామాలవి ల. ఆ రెండు చోట్లా కూడా 20 మందికి మించలేదు.

మూడో పేజీ

మూడో పేజీలో కూడా సగం దీనికే కేటాయించాడు . మొత్తం మూడు ఫోటోలు వేసాడు. సౌదీలో 8 మంది, లండన్ లో 8 మంది, ఆస్ట్రేలియాలో ఇద్దరు.

మూడు మెయిన్ పేజీలలో కలిపి మొత్తం 13 ఫోటోలు వేశారు . రెండు ఫోటోలలో మాత్రమే 15 నుండి 20 మంది దాకా ఉన్నారు. మిగతా అన్ని ఫోటోలలో కూడా 1 ,2 ,3 ,6 ఇలా ఎక్కడా 8 మందికి మించి లేరు .

దీనిని బట్టి అమరావతి ఉద్యమం ఎంత ఉధృతంగా ఉందో మీరే ఊహించుకోవచ్చు . రాజధానికి అటు ఇటు ఉన్న గుంటూరు , విజయవాడలలో ఒక్కడంటే ఒక్కడు కూడా బయటకొచ్చి వీళ్లకు సంఘీభావం తెలిపినోడు లేడు. టీడీపీ ఎమ్మెల్యేలలో కానీ, ఎంపీలలో కానీ, క్యాడర్లో కానీ దీనికోసం రోడ్డెక్కినోడో లేరు.

40 ఏళ్లుగా ఎదురులేకుండా ప్రజలను నమ్మించి రాజకీయాలని గుప్పిట్లో పెట్టుకొని శాసించావు . ఆ “రెండు పత్రికలు ” అంటూ ఆనాడు వైయస్ మీ బట్టలూడదీయటం మొదలుపెడితే ..ఇప్పుడు సోషల్ మీడియా మిమ్మల్ని నగ్నంగా నిలబెడుతుంది .


ఇదీ ఆ పోస్టు. నిజమే కదా…200 రోజులుగా రోజూ వార్తలు వేస్తూనే ఉన్నారు. అయినా అమరావతి ఉద్యమం ఆ ఐదారు ఊళ్ల పొలిమేరలు దాటలేదు. ఆఖరికి విజయవాడ, గుంటూరు ప్రజలు కూడా ఉద్యమానికి సంఘీభావంగా లేరు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నవారు, వ్యవసాయ భూములకు కోట్లు వచ్చేస్తాయని ఆశలు పెట్టుకున్న వారు మినహా…సాధారణ ప్రజలెవరూ అమరావతిని సొంతం చేసుకోలేదు. అటువంటి భావోద్వేగాలను పెనవేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోతుందంటే…ప్రజల్లో వచ్చిన పూనకం వంటిది అమరావరి విషయంలో రాలేదు. అయితే…టిడిపి అనుకూల మీడియా మాత్రం పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*