ఆ పత్రికల్లో ఆ వార్తే లేదు..! అది వార్త కదా…!!

రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదాస్పద కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాదులోని ఓ హోటల్ లో సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ ను కలవడంపై మంగళవారమంతా టివి ఛానళ్లు, సోషల్ మీడియా‌లో వార్తలు, చర్చలు హోరెత్తాయి.‌ అయితే బుధవారం ఉదయం పత్రికలు చూస్తే ఆశ్చర్యం వేసింది. రెండు ప్రధాన పత్రికల్లో ఆ వార్తే లేదు. ఇంకా ఆశ్చర్యం ఏమంటే…ఒక కమ్యూనిస్టు పార్టీ పత్రికలోనూ వార్త కనిపించకపోవడం.

తీవ్ర ‌దుమారం రేపిన ఇటువంటి అంశాలపైన తమకు ఇష్టం లేకున్నా వార్తలు ప్రచురించాల్నిన నైతిక బాధ్యత పత్రికలకు ఉంటుంది. కనీసం ప్రాధాన్యత తగ్గించయినా ప్రచురించాలి. నిమ్మగడ్డ రహస్య భేటీ కచ్చితంగా వార్తకు అర్హమైనదే. ఒక పత్రికలో ప్రధాన వార్త వేయకుండా… దానికి సమాధానంగా సుజనా ఒకప్పుచౌదరి ఇచ్చిన ప్రకటనను‌ ప్రచురించారు. ఇంకో పత్రికలో ఆ వార్త సోయే లేదు. ఆ పత్రికకు సంబంధించిన టివి ఛానల్ లో ఈ అంశంపై చర్చలు పెడుతున్నా…పత్రికలో మాత్రం వార్త వేయకపోవడం గమనార్హం.

ఇటువంటప్పుడే…సోషల్ మీడియా అవసరం ఏమిటో అర్థమవుతుంది. ఒకప్పడు ప్రధాన స్రవంతి మీడియా రాసిందే వార్త. తమకు ఇష్టం లేని వార్తను ఈ విధంగా తొక్కిపెట్టేవి. సోషల్ మీడియా వచ్చాక ప్రధాన మీడియా దాచిపెట్డిన అంశాలూ సమాజం ముందుకు వస్తున్నాయి. ఈ విషయం అర్థంకాక…ఇప్పటికీ నిజాలను దాచాలని పత్రికలు ప్రయత్నిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*