ఆ రాక్షస మిడతలొస్తే.. సూర్యుడు మాయం..!

ధర్మచక్రం ‌ప్రతినిధి – తిరుపతి

కరోనా మహన్మారి నుంచి కాస్త ధైర్యం కూడగట్టుకుని, రెండు నెలల పాటు స్తంభించిన జన జీవనం‌ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కతోంది. ఈ తరుణంలో మరో భయం దేశం‌ ప్రజలని‌ అందోళనకు గురి సేస్తోది. అదే రాకాసి లాండి మిడతల దండు.

లక్షలు, కోట్ల సంఖ్యలో దండెత్తే ఎడారి మిడతలు వందల వేల ఎకరాల్లో పంటలనైనా క్షణాల్లో చప్పరించేస్తాయి. వరిపైరు మీద వాలితే…దంటు ఆనవాలు కూడా మిగలకుండా తినేస్తాయట. మందులు పిచికారి చేసే సమయం కూడా ఉండదట.

మొన్నటిదాకా పాకిస్థాన్‌లో కనిపించిన ఈ మిడతల దండు ఇప్పుడు మన దేశానికీ వచ్చేసింది. మహారాష్ట్ర దాకా వచ్చిన‌ మిడతలు పక్కనే ఉన్న తెలంగాణలోకీ ప్రవేశించవచ్చని‌ ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోకి వస్తే కొన్ని రోజుల్లోనే దక్షిణాది రాష్ట్రాలను కమ్మేయవచ్చు. అందుకే ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మిడతలను ఎదుర్కోడానికి చర్యలు చేపట్టాయి.

ఈ మిడతల దండుపై 1935 లోనే పరిశోధన జరిగింది. స్వాతంత్రానికి పూర్వం కరాచీలోని ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో పనిచేస్తున్న రావు సాహెబ్ రామచంద్రరావు మిడతలపై పరిశోధన చేశారు. ఆ పరిశోధన గ్రంథాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మిడతల దండు గురించి వేదాలు, బైబిల్ లో కూడా ఉన్నట్లు ఆయన తన పరిశోధన గ్రంథాలు రాశారు. మిడతల దాడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే…అవి వచ్చేటప్పుడు ఆకాశంలో సూర్యుడు కూడా కనిపించకుండా పోతాడట. అంటే అంత పెద్ద సఖ్యలో వస్తాయి.

మిడతల్లో మొత్తం మూడు రకాల ఉన్నాయి. అందులో మొదటి రెండు రకాల వల్ల పెద్దగా ప్రమాదం లేదు. ఎడారి మిడతల వల్లే ఇప్పుడు ఆందోళనంతా. అవి పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ మీదుగా భారత్లోకి ప్రవేశిస్తాయి. మిడతల దండు గంటకు 12 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని శాస్త్ర శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక కిలో మీటరు పరిధిలో విస్తరించిన మిడతలు రోజుకు 35 వేల మందికి సరిపడా ఆహారాన్ని తినేస్తాయన్నది‌ అంచనా. 2003 – 2005 కాలంలో ఆఫ్రికా ఖండంలో 26 దేశాలపై‌ దాడి చేసిన మిడతల దండు 1.350 కోట్ల హెక్టార్లు పంటలను తినేసేయట. మిడతల వల్ల ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉండటంతో ఐక్యరాజ్యసమితి కూడా ఇటీవలే భారత దేశాన్ని అప్రమత్తం చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*