ఆ లడ్డూలే పెట్టండి… పద్మావతి అమ్మవారు మంగాపురం నుంచి అలిగి వెళ్లిపోవడం ఖాయం!

తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రశస్తి ఉంది. తిరుమలలో లడ్డు కోసం భక్తులు ఎంతగానో తహతహ లాడుతారు. ఎందుకంటే ఆ లడ్డు ఎంత రుచికరంగా ఉంటుంది. శ్రీవారికి ప్రపంచంలోనే అరుదైన రుచికరమైన లడ్డులను నైవేద్యంగా పెడుతున్న టీటీడీ… స్వామివారి ఇల్లాలు అయిన అలివేలు మంగమ్మకు మాత్రం రుచీపచీ లేని లడ్డులను నైవేద్యంగా పెడుతోంది. అలివేలు మంగమ్మ కొలువైన తిరుచానూరులో ఆలయంలో భక్తులకు ఇస్తున్న లడ్డూలు అత్యంత నాశిరకంగా ఉన్నాయి. లడ్డు కు ఉండవలసిన కనీసమైన రుచి కూడా తిరుచానూరు లడ్డు కు లేదు. లడ్డుల తయారీలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. లడ్డుల ఆకృతి వడలాగా ఉందంటే ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఒక్కో గడ్డూనయ పది రూపాయలకు విక్రయిస్తున్నారు. పరిమాణం పర్వాలేదు గాని రుచి మాత్రం అత్యంత తీసికట్టుగా ఉంది. తిరుమల లడ్డూకు తిరుచానూరు లడ్డుకు అంత తేడా ఎందుకు ఉండాలో టిటిడి అధికారులకే తెలియాలి. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో ఇస్తున్న లడ్డూలు ఇంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ రుచికరంగా ఉంటాయి. తిరుచానూర్ రోడ్డు రేటును ఇంకో పది రూపాయలు పెంచిన ఫర్వాలేదుగానీ తక్కువ ధర పెట్టి ఈ విధమైన నాణ్యతలేని లడ్డూలను ఇవ్వడం వల్ల టిటిడికి చెడ్డ పేరు వస్తుంది. ఉన్నతాధికారులు ఎవరురా ఏనాడైనా
ఈ లడ్డూను రుచి చూసి ఉంటే నాణ్యత గురించి ఆలోచించకుండా వదిలేస్తే వాళ్లు కాదు. ధర్మచక్రం ప్రతినిధి ఆలయం వద్దకు వెళ్లి లడ్డూ నాణ్యతపై పదిమంది నుంచి అభిప్రాయాలు సేకరించగా ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేయలేదు. టీటీడీ అధికారులు అవసరమైతే తిరుచానూరు లడ్డుపై సేకరణ చేయవచ్చు. 10 శాతం మంది లడ్డు బాగుందని చెప్పినా కొనసాగించ్చు. ఎటు తయారు చేస్తున్నారు కాబట్టి కాస్త రుచికరంగా చేస్తే తిరుమల లడ్డూలు దొరకని వారు…తిరుచానూరు లడ్డూలతోనైనా సంతృప్తి చెందుతారు. లడ్డుల నాణ్యత పెంచకుండా ఇవే లడ్డూలను నైవేద్యం గా పెడుతుంటే రోజూ తినలేక అమ్మవారు మరోసారి అలిగి మంగాపురం నుంచికూడా వెళ్లిపోవడం ఖాయం.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*