ఆ వార్త రాసినందుకు‌ టిటిడి ఛైర్మన్ నాపైన నిప్పులు కక్కారు…నెగిటివ్ గానే రాయాల్సిన పనిలేదు…ఆ కథనంతో ఎంతో‌ ఆనందం…!

  • కలం యోధుల అనుభవాలు – జ్ఞాపకాలలో విశ్రాంత పాత్రికేయులు రాఘవన్ వెబుతున్న విశేషాలు

అందరూ అనుకుంటారు రాజకీయ నాయకులు, అధికారులు ఎక్కువ సేవ చేస్తారని…అయితే వాళ్లకు కొన్ని పరిమితులు, పరిధులు ఉన్నాయి. ఒక అధికారి తన డిపార్టుమెంటు పరిధిలోనే ఏమైనా చేయగరు. రాజకీయ నాయకుడు అధికారంలో ఉంటేనే చేయగరు. జర్నలిస్టుకు ఆ పరిధులు, పరిమితులు లేవు. ఏ రంగంలోనైనా జనాలకు ఉపయోగపడే పనులు చేయడానికి ఈ వృత్తిలో అవకాశముంది. జర్నలిస్టుగా పేదల్లోకెళ్లా పేదలైన వారికి అవసరమైన పనుల్లో కనీసం 10 శాతం చేయడానికి దోహదపడినా చాలు. అందులో ఉండే సంతృప్తి ఎన్ని కోట్లు సంపాదించినా రాదు. ఒక చోట పేదలకు రేషన్‌ బియ్యం అందలేదు….ఆ విషయంపై మనం వార్త రాసి అధికార యంత్రాంగాన్ని కదిలించి…బియ్యం అందేలా చేయగలిగాం…అదే పేదలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. అయితే రాసే ముందు నిజానిజాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒక చోట అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని తెలిస్తే…ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుని, ధ్రువీకరించుకున్న తరువాతే రాయాలి. మనం రాస్తే…దాన్ని అందరూ అంగీకరించేలా ఉండాలి. మనం రాసింది సరైనది కాదని ఎవరూ ఎత్తిచూపేలా ఉండకూడదు. అప్పుడే మనం రాసే కథనాకు విలువ ఉంటుంది. విలేకరిగా మనకు గౌరవం లభిస్తుంది. మన వార్తలకు అంతటి విశ్వసనీయత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.

తిరుపతిలో ఉండటం దేవుడిచ్చిన వరమే…
తిరుపతిలో విలేకరిగా ఉండటం దేవుడిచ్చిన వరమే. దేశంలో ఏ ఇతర ప్రాంతా విలేకరులకూ లేని అవకాశాలు తిరుపతిలోని పాత్రికేయులకు ఉన్నాయి. పుణ్యక్షేత్రంగా తిరుపతికి ఉన్న ప్రాధాన్యత వల్ల ఇక్కడికి వచ్చే వివిధ రంగాల ప్రముఖుల పర్యటన వార్తలు ఇవ్వడమేగాదు… వారితో మాట్లాడగల అవకాశం, సావధానంగా ఇంటర్వ్యూ వంటివి తీసుకోగల అరుదైన సదావకాశాలు స్థానిక విలేకరులకు లభిస్తుంది. నన్నే తీసుకుంటే…రాష్ట్రపతుల్లో శంకర్‌ దయాళ్‌ శర్మ, అబ్దుల్‌ కలాం, ప్రధానుల్లో పివి, దేవేగౌడ, వాజ్‌పేయి, రాజకీయ ప్రముఖుల్లో సోనియాగాంధీ, ప్రకాషకారత్‌, ఒకప్పటి శ్రీంక ప్రధాని విక్రమసింఘే, మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్‌ రెడ్డి, చెన్నారెడ్డి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జయలలిత, ఎస్‌ఎం క్రిష్ణ, ఫరూక్‌ అబ్దుల్లా, కేంద్ర మంత్రులు మురళీ మనోహర్‌ జోసి, చిదంబరం, వెంకయ్యనాయుడు (ఇప్పుడు ఉప రాష్ట్రపతి), గులాంనబీ ఆజాద్‌, ఇంకా సుప్రీం న్యాయమూర్తులు, కేంద్రంలోని ఉన్నతాధికారులు…స్వామీజీలు, పీఠాధిపుతులు, ఆధ్మాత్మికవేత్తలు….ఇలా చాలా మందితో నేరుగా మాట్లాడి ప్రత్యేక కథనాలు ఇచ్చాను. రాజీవ్‌గాంధీ హత్య కేసు దర్యాప్తు కోసం నియమించిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌)కు నేతృత్వం వహించిన కార్తికేయన్‌ తిరుమలకు వచ్చినపుడు ప్రత్యేకంగా మాట్లాడి కథనం రాశాను. ఇంత మందితో మాట్లాడగల అవకాశం ఒక్క తిరుపతి విలేకరులకు తప్ప ఇతర ప్రాంతాల్లోని వారికి ఉండదు. ఎంతపెద్ద అధికారి అయినా, ప్రజాప్రతినిధి అయినా భక్తునిగా తిరుమలకు వచ్చినపుడు ఎంతో ప్రశాంతంగా, కాస్త తీరికగా ఉంటారు. అందుకే ఇక్కడ విలేకరులు ప్రశ్నలు అడిగినా విసుక్కోకుండా ఓపిగ్గా సమాధానాలు చెబుతారు. దర్శనానికి ముందో, దర్శనానికి తరువాతో తీరిగ్గా కొంతసేపు ముచ్చటించే వీలు ఉంటుంది. నేనైతే పర్యటన వార్తకంటే… విఐపి బస చేసిన గెస్ట్‌హౌస్‌కి వెళ్లి ముఖాముఖి మాట్లాడి ప్రత్యేక కథనాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపేవాడిని.

ప్రిపేరై వెళ్లాలి…
వివిధ రంగాల వార్తలను రాసే అవకాశమూ తిరుపతి విలేకరులకు ఉంటుంది. స్వామీజీలు వచ్చినపుడు ఆధ్మాత్మిక అంశాలు, శాస్త్రవేత్తలు వచ్చినపుడు సైన్స్‌ సంబంధ విషయాలు, క్రీడాకారులు వచ్చినపుడు ఆ రంగానికి చెందిన అంశాలు, సినిమా ప్రముఖులు వచ్చినపుడు చిత్రసీమ సంగతులు, రాజకీయ నాయకులు వచ్చినపుడు రాజకీయాలు, రక్షణరంగ అధికారులు వచ్చినపుడు దేశ రక్షణకు సంబంధించిన విశేషాలు, విదేశీయులు వచ్చినపుడు ఆ స్థాయి అంశాలను వార్తులుగా రాయాల్సి ఉంటుంది. ఇది ఒకరకంగా సదవకాశం. మరో రకంగా ఛాలెంజ్‌తో కూడుకున్న పని. అందుకే… ఎవరి వార్త కవరేజ్‌కి వెళుతున్నా… సంబంధిత అంశాపైలన, అప్పటికి చర్చనీయాంశంగా ఉన్న విషయాలపైన కనీస అవగాహన కలిగి ఉండాలి. నేనైతే ఏ విఐపి తిరుపతికి వస్తున్నా…ఆ ప్రోగ్రాంకి వెళ్లేటప్పుడు…వారం పది రోజుల పత్రికలు తిరగేసి…ఆ విఐపిని అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసుకుని, అందుకు సంబంధించిన సమాచారం సేకరించుకుని వెళ్లేవాడిని. ఇలా ప్రిపేరయి వెళ్లడం వల్ల మంచి ప్రశ్నలు అడిగేందుకు వీలుంటుంది. మంచి కథనాలు వస్తాయి. జర్నలిస్టుగా మంచి పేరూ వస్తుంది. ఎంత పెద్ద జర్నలిస్టుయినా ప్రిపేరయి వెళ్లడం తప్పులేదన్నది నా దృఢ అభిప్రాయం.

విశ్వాసం కోల్పోకూడదు…
విలేకరిగా రాజకీయ నాయకులతోనో, అధికారులతోనే మనకున్న సంబంధాలు, స్నేహం వల్ల కొన్ని రహస్యాలు ఆఫ్‌ ద రికార్డుగా చెబుతుంటారు. ఆ రోజు ఆ విషయం రాస్తే సంచలన వార్తే అవుతుంది. అయితే మనమీద నమ్మకంతో చెప్పిన రహస్యాన్ని పత్రికకు ఎక్కిస్తే…వారి విస్వాసం కోల్పోతాం. భవిష్యత్తులో సాధారణ విషయాలు కూడా మనతో పంచుకోరు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకు ఎం.సత్యనారాయణ (ఎంఎస్‌) చాలా సరదాగా ఏవోవో విషయాలు మాట్లాడేస్తారు. మనతో ఉన్న అనుబంధం వల్లే ఆయన అలా మాట్లాడుతారు. ఇందులో ఆయనకు ఇబ్బంది కలగని, మన మధ్య సంబంధాలు దెబ్బతీయని విషయాలు మాత్రమే రాయాలి. మరో విషయం కూడా విలేకరులు గుర్తించుకోవాలి. సంచలనం కోసం ఏదంటే అది రాయకూడదు. వ్యక్తిగత విషయా జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక ఎంఎల్‌ఏ మద్యం తాగుతాడు…అక్కడ వరకు విలేకరికి ఇబ్బంది ఉండకూడదు. అదే తాగి వీధుల్లోకి వచ్చి రభస సృష్టిస్తాడు… అప్పుడు విలేకరి కల్పించుకుని వార్త రాయవచ్చు.

నెగిటివ్‌గానే రాయాల్సిన అవసరం లేదు…
ఇటీవ కాలంలో చాలా మంది విలేకరులను చూస్తున్నాను. నెగిటివ్‌గా రాస్తేనే వార్తని అనుకుంటున్నారు. ఇది సరైనది కాదని నా ఉద్దేశం. ఉదాహరణకు తిరుమలకు విఐపిలు వస్తుంటారు. భద్రత విషయంలో చిన్న లోపం జరిగితే…పోలీసుల వైఫ్యం చెందినట్లు వార్తలిస్తారు. కానీ పోలీసులు పడే ఇబ్బందులు పట్టించుకోం. ప్రధాని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వంటి వారు వచ్చేటప్పుడు రెండు రోజుల ముందు నుంచే కానిస్టేబుళ్లు ఘాట్‌రోడ్డులో నిలబడి డ్యూటీ చేస్తుంటారు. వారికి సమయానికి తాగేందుకు నీళ్లుండవు. తినేందుకు తిండివుండదు….కాకృత్యాలు తీర్చుకునే అవకాశముండదు…ఇలాంటి విషయాలనూ రాయగలాలి. నేను ఒకసారి ఇలాంటి కథనం చేస్తే మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా విధి నిర్వహణలో అధికారులకు – విలేకరుకు, రాజకీయ నాయకులకు – విలేకరుకు, పోలీసుకు – విలేకరుకు…కొన్ని వైరుధ్యాలు తలెత్తుతుంటాయి. విఐపిలు వస్తున్నప్పుడు భద్రతలో లోటుపాట్లు జరగకూడదని పోలీసులు అనుకుంటారు. వార్తు సేకరించాలని మనం అనుకుంటాం… చిన్నపాటి ఘర్షణ తలెత్తుతుంది. దాన్ని అంతదాకే చూడాలి. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అలాగే మనం వ్యతిరేకంగా రాస్తున్నామన్న భావన కలిగించడం కంటే నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ రాస్తున్నామన్న భావన కలిగించడం ముఖ్యం. ఉదాహరణకు టిటిడి రూ.300 టికెట్లు ఆన్‌లైన్‌ దర్శన విధానం తీసుకొచ్చింది.  నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న మన దేశంలో ఇంటర్నెట్‌ అందుబాటు, వాడకం తక్కువ. అందుకే ఆన్‌లైన్‌ దర్శన విధానం తప్పు అని రాసేదానికంటే… ఇంటర్నెట్‌ విధానం అందరికీ తెలిసేదాకా, వాడకం పెరిగేదాకా తిరుమలోనూ కరెంటు కౌంటర్ల ద్వారా టికెట్లు ఇచ్చి దర్శన సదుపాయం కల్పిస్తే బాగుంటుందని సూచిస్తూ వార్తలు రాస్తే అధికారులూ ఆలోచిస్తారు. వ్యతిరేకంగా రాశామన్న భావన వారిలో కలగదు….నేను చెప్పదల్చుకున్నది ఏమంటే…విమర్శచేసి వదిలేయడంకంటే…పరిష్కారానికి తగిన సూచనలూ మన వార్తలో ఉండాలి. అప్పుడే మన వార్తల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది.

అరుదైన అవకాశాలు….
  నేను విలేకరిగా పని చేసిన దాదాపు 24 ఏళ్ల కాలంలో రిపోర్టింగ్‌లో అనేక అరుదైన అవకాశాలు లభించాయి. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, స్టూడియో ఎన్‌, టివి 5, సిటికేబుల్‌…ఇలా నేను పని చేసిన ప్రతి సంస్థల్లోనూ విశేషమైన అనుభవాలు ఉన్నాయి. అలిపిరిలో చంద్రబాబు నాయుడిపై మావోయిస్టు కైమోర్‌మైన్స్‌తో దాడి చేసినపుడు, ఆ తరువాత సుదీర్ఘంగా సాగిన దర్యాప్తుపై వరుసగా ఇచ్చిన కథనాలు ఇప్పటికీ నాకు గుర్తే. ఇంకా తిరుపతిలో జరిగిన ఏఐసిసి ప్లీనరీ సమావేశాలు, తెలుగుదేశం మహానాడు, పిఆర్‌పి ఆవిర్భావ సభ, ఈ పాతికేళ్లలో జరిగిన జనరల్‌ ఎన్నికల్లో నాలుగైదు జిల్లాల రిపోర్టిగ్‌, సునామీ వంటి విపత్తు సమయంలో తీర ప్రాంతానికి వెళ్లి రాసిన కథనాలు, కంచిపీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి 100 ఏళ్ల వేడుకలు, ఆయన నిర్యాణం సందర్భంగా ఇచ్చిన వార్తలు…దేనికది విశేషమైన అనుభవం. జ్ఞాపకమే. అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి టిఎన్‌ శేషన్‌ కంచిమఠానికి వచ్చిన సందర్భంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ కూడా…పంచెకట్టులో ఉన్న ఆయన ఫొటో సంపాదిస్తే…‘మరో కోణంలో శేషన్‌ ’ అనే శీర్షికన రెండో రోజు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మొదటి పేజీలో ప్రచురితమైతే…అందులో కలిగిన ఆనందమే వేరు. సునామీ వచ్చినపుడు తీరం వైపు‌ ఎవరినీ వెళ్లనీకుండా ట్రాఫిక్‌ ఆపేసినపుడు…. పోలీసును ప్రాదేయపడి, అతికష్టం మ్మీద నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతం తీరానికి చేరుకుని కథనాలు రాసినపుడు జర్నలిస్టుగా కలిగిన సంతృప్తి వేరు. చంద్రబాబు నాయుడిపై దాడి సందర్భంగా అన్ని పత్రికలవారు పదుల సంఖ్యలో విలేకరులు పనిచేసి కథనాలు ఇస్తే…నేను ఒక్కడినే అయినా అన్ని పత్రికలకు దీటుగా వార్తలు రాయడంలో కలిగిన ఆనందం చెప్పలేనిది.

ఆ కథనంతో ఎంతో ఆనందం…
ఒకసారి టిటిడి డబ్బును ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని పాకల మండలి ఛైర్మన్‌ భావించారు. ఇది నష్టమని, దీని వల్ల దేవుడి డబ్బుకు భద్రత ఉండదని అప్పటి ఈవో నాకు చెప్పారు. అప్పటి నిబంధనల ప్రకారం దేవస్థానం నిధులను జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్‌ చేయాలి. ఈ నిబంధనలను సవరించాని ఛైర్మన్‌ నిర్ణయానికి వచ్చారు. దీనిపై ఓ కథనం చేశాను. హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వం స్పందించింది. ఆలా చేయవద్దని ఆదేశించింది. దీంతో ఆయన ప్రయత్నాలు ఆగిపోయాయి. నా కథనంతో దేవుడి డబ్బును కాపాడానన్న సంతృప్తి కలిగింది. ఇలా చేసినందుకు ఛైర్మన్‌ నాపై నిప్పులుకక్కారు. విలేకరిగా మన ఆలోచన తప్పయినపుడు దాన్ని దిద్దుకోడానికి వెనుకాడకూడదు. తిరుమల వెయ్యికాళ్ల మండపం విషయంలో అదే జరిగింది. పురాతనమైన కట్టడాన్ని తొగించాలని అనుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ముందుగా కథనం రాశాను. అయితే అప్పటి ఈవో నన్ను పిలిపించి ఆలయ భద్రత, భక్తుల సౌకర్యం కోసం వెయ్యికాళ్ల మండపాన్ని తొగించాల్సిన అవసరం ఎంతవుందో వివరించారు. ఆదే సరైనదని అనిపించింది. ఆ తరువాత ఆ కోణంలోనే కథనాలు ఇచ్చాను. వెయ్యికాళ్ల మండపం తొగించడం ఎంత సరైన నిర్ణయమో ఆ తరువాత రుజువయింది. బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్ని లక్ష మంది తిరుమలకు వచ్చినా తొక్కిసలాట జరగకుండా సవ్యంగా సాగుతోందంటే ఆలయ ముందుభాగం సువిశాలంగా ఉండడమే. తప్పును సరిదిద్దుకోడానికి ఎలా వెనుకాడ కూడదదో… మన తప్పులేనపుడు ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. ఒకసారి ఈవోగారు ఏదో మాట్లాడాలని నన్ను పిలిపించారు. ఆఫీసుకు వెళ్లాను. కొన్ని గంటలు నిరీక్షించాను. అయినా లోనికి పివలేదు. ‘ఇక నేను వెళతాను’ అని సిసికి చెప్పేసి వెళ్లిపోయాను. తరువాత కొంతసేపటికి ‘ఈవోగారు పిలుస్తున్నారు’ అంటూ ఇంటికి ఫోన్‌ చేశారు. ‘ఇప్పుడు రాలేను…రేపు వస్తాను’ అనే చెప్పాను. ఈవో మాట్లాడినా అదేమాట చెప్పాను. రెండో రోజు వెళ్లి ఈవోను కలిసి మాట్లాడాను.

ఓ అమ్మాయి జీవితాన్ని నిబెట్టిన కథనం….
నేను రాసిన ఓ మానవీయ కథనం ఇప్పటికీ నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. 2004 ఎన్నిక సమయంలో కవరేజ్‌ కోసం కెవిపల్లికి వెళ్లాను. అక్కడ ఓ నిరుపేద ముస్లిం కుటుంబాన్ని చూశాను. రెడ్డి బాషాకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. తనకున్న మూడు ఎకరాల మెట్ట భూమిని వర్షాధారంగా సాగుచేసి, టీ దుకాణం నడిపి అందరినీ బాగా చదివించాడు. ఆ తరువాత నక్సలైట్ల సమస్య వల్ల టీ అంగడి మూతపడింది. కరువు పరిస్థితు వల్ల భూములు సాగుకాలేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబం గడవడం కూడా కష్టమయింది. అందుకే భూమిని అయినకాడికి అమ్మేసి అసిబి అనే కూతురు పెళ్లి చేయానుకున్నాడు. ఆమె బిఎస్‌బి (బయోకెమెస్ట్రీ) ఫస్ట్‌ క్లాస్‌లో పాసయింది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. పెళ్లి చేస్తే…అక్కడైనా మూడు పూటలా అంత తిండి తింటుందన్నది తండ్రి ఆశ. అందుకే 8వ తరగతి వరకు చదువుకుని కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేసే ఓ యువకునితో సంబంధం కుదుర్చే ప్రయత్నం చేశాడు. ‘నాకు పెళ్లిచేస్తే నేనైనా సంతోషంగా ఉంటానని మా నాన్న అనుకుంటున్నారు. అదే నాకు ఉద్యోగం వస్తే నాన్నను, తోటి సోదరీ సోదరులను పోషించగను’ అని ఏడుస్తూ చెప్పింది. దీనిపై రాసిన మానవీయ కథనానికి విశేషమైన స్పందన భించింది. అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి ఆమెకు ఉద్యోగం ఇప్పించారు. ఆ తరువాత ఆ తండ్రీ కూతుళ్లు మా ఇంటికి వచ్చి నాకు సమస్కరించి వెళ్లారు. నా వార్త వల్ల ఒక అమ్మాయి జీవితం నిబడిందన్న ఆనందం కలిగించిన సంతృప్తి అంతా ఇంతా కాదు. మరో కథనం గురించి కూడా చెప్పాలి….భారత దేశంలో ఎయిడ్స్‌ అప్పుడే ప్రబుతున్న రోజులు… తిరుపతిలోని ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో పలువురు ఎయిడ్స్‌ బాధిత మహిళలు ఉండేవారు. వారు ఆ జబ్బుబారిన ఎలా పడ్డారో తెలుసుకుని కథనాలు రాయాలని అనుకున్నాను. అక్కడికెళితే ఎవరూ నాతో మాట్లాడనైనా మాట్లాడలేదు. అందుకే దాదాపు 15 – 20 రోజులు  రోజూ అక్కడికి వెళ్లివస్తూ మెల్లగా వారికి దగ్గరయ్యాను. ఆ చొరవతో తమ కన్నీటి గాథను చెప్పారు. ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడే అమ్మేశాడు. ముంబయి వ్యభిచార గృహంలో మగ్గిపోయిన ఆమె ఎయిడ్స్‌బారిన పడింది. దాంతో ఆమెను అక్కడి నుంచి పంపేశారు. అందరివీ ఇలాంటి కన్నీటి కథలే. అన్నీ కలిపి రాసిన ఓ కథనం నాకు విలేకరిగా ఎంతో సంతృప్తిని కలిగించింది.

అద్భుతమైన వృత్తి….
జర్నలిజం ఒక అద్భుతమైన వృత్తి. దీనికి సాటి మరొకటి లేదన్నది నా అభిప్రాయం. దాదాపు 25 ఏళ్లు జర్నలిస్టుగా కొనసాగినందుకు ఒకింత గర్వంగా ఉంటుంది. మా అబ్బాయి సందీప్‌ కూడా ఇదే రంగంలోకి ప్రవేశించారు. నేను జర్నలిస్టుకు చెప్పేది ఒక్కటే…ఏమి రాసినా విమర్శలకు తావులేకుండా ఉండాలి. ఎవరిపైనైతే రాశామో…వారు కూడా ఆ వార్తలోని ఔచిత్యాన్ని అంగీకరించేలా ఉండాలి. అంతిమంగా అది సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఇదే ప్రజోపయోగ జర్నలిజానికి గీటురాయి.
‌‌ – రాఘవన్‌, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*