ఇంతకీ ఆ మేడం ఎవరు?

టిటిడి వివాదంలో కొత్తగా ఓ మేడం ప్రస్తావనకు వచ్చారు. శ్రీవారి ఫోటులో తవ్వకాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులు…. పోటును ఎందుకు తవ్వుతున్నారని తాను జెఇఓ శ్రీనివాసరాజు ను ప్రశ్నించినప్పుడు ” మేడం కూడా చెప్పారు” అని తనకు వివరణ ఇచ్చారని చెప్పారు. అయితే ఆ మేడం ఎవరో, ఆమెకు ఆలయాని సంబంధం ఏమిటో దీక్షితులు చెప్పలేదు. ఇదిలావుండగా రమణ దీక్షితులు ఆరోపణలపై వివరణ ఇచ్చిన జెఇఓ శ్రీనివాసరాజు కూడా మేడం ప్రస్తావన‌ తెచ్చారు. రమణ దీక్షితులు గారు ఆరోపణలు చేస్తూ రోజుకొక పేరు వివాదంలోకి లాగుతున్నారు. ముఖ్యమంత్రి గారిని, మేడంను వివాదంలోకి లాగడం తగదు అని వ్యాఖ్యానించారు. ఆ మేడం ఎవరనేది జెఈఓ కూడా చెప్పలేదు. ఇంతకీ మేడం ఎవరు, ఇందులో ఆమె ప్రమేయం ఏమిటి అనేది సస్పెన్స్ గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*