ఇంతకీ వర్మ శ్రీకృష్ణుడా…శకునియా!

తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై పోరాటం సాగిస్తున్న శ్రీరెడ్డి పవన్‌ కల్యాణ్‌ను తీవ్రమైన పదజాలంతో విమర్శించడంపై దుమారంరేగింది. అయితే శ్రీరెడ్డి తిట్టడం వెనుక రాంగోపాల్‌ వర్మ ఉన్నారని తెలిసి అందరూ విస్తుపోతున్నారు. పవన్‌ను ‘మాదర్‌చోద్‌’ అని తిట్టమని తానే శ్రీరెడ్డికి సూచించానని వర్మే స్వయంగా అంగీకరిస్తున్నారు. అయితే…ఇందుకు ఆయన చెబుతున్న కారణాలు సహేతుకంగా కనిపించడం లేదు. తాను లేవనెత్తిన అంశంపై పవన్‌ తగిన రీతిలో స్పందించలేదన్న అభిప్రాయాన్ని రాంగోపాల్‌ వర్మ వద్ద శ్రీరెడి వ్యక్తపరిచారు. దానికి ఆయన….ఘాటైన పదజాలంలో విమర్శిస్తే…అందరి ఏకాగ్రత ఇటువైపు మళ్లుతుందని, అందుకే మాదర్‌చోద్‌ అని మాట్లాడమన్నానని వర్మ ఓ వీడియోలో చెప్పారు. అయితే…శ్రీరెడ్డితో ఆ విధంగా మాట్లాడించడం వెనుక రాజకీయ కుట్రవుందని పవన్‌ అభిమానులు, అనుచరులు భావిస్తున్నారు. ఆ విధమైన విమర్శలు మొదలయ్యాక…పవన్‌కు వర్మ క్షమాపణలు కూడా చెప్పారు.

ఇక్కడ రాంగోపాల్‌ వర్మ చెబుతున్న వివరణ అంతా ఆమోదయోగ్యంగా లేదు. శ్రీరెడ్డి ఒక సమస్యను వర్మ దృష్టికి తీసుకెళ్లింది. ఆయనే స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసివుండొచ్చు. లేదా ఆయనే ఒక ఆందోళనకు శ్రీకారం చుట్టివుండొచ్చు. అలాంటివేవీ చేయకుండా…పవన్‌ను కల్యాణ్‌ను దూషించమని చెప్పడంలో అర్థంలేదు. పవన్‌ కల్యాణ్‌ ఓ రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుడు కూడా. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు దూషించడం నేరం కూడా అవుతుంది. ఆ నేరం చేయడానికి ప్రేరేపించిన రాంగోపాల్‌ వర్మదీ తప్పు అవుతుంది. రాంగోపాల్‌ వర్మ అమాయకుడు కాదు. మేథావిగా గుర్తింపుపొందిన దర్శకుడు. ఆటువంటి వ్యక్తి….పవన్‌ను అంత పెద్దమాటలతో దూషిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించలేరని అనుకోలేం. అంందుకే పవన్‌ అభిమానులు, అనుచరులు ఆరోపిస్తున్నట్లు దీని వెనుక….రాంగోపాల్‌ వర్మకు రాజకీయ ప్రయోజనం లేకున్నా…ఏదో కుట్రపూరితంగానే ఇదంతా చేశారని భావించాల్సివస్తోంది.

ఇక్కడే ఇంకో విషయం ఏమంటే….సోషల్‌ మీడియాలో ఓ కార్టూన్‌ వైరల్‌ అవుతోంది. మహాభారతంలోనే ద్రౌపదీ వస్త్రాపహరణం దృశ్యాన్ని మార్పుచేసి…శ్రీరెడ్డికి చీరలు ఊడదీస్తున్నట్లు, శ్రీకృష్ణుని వేషధారణలో వర్మ వలువలు అందిస్తున్నట్లు వేశారు. ఈ పోరాటంలో శ్రీరెడ్డిని వర్మ రక్షిస్తున్నాడని అర్థం వచ్చేలావుందిమే. ఏమైనా బలయింది మాత్రం శ్రీరెడ్డి. ఇంతకీ వర్మ…శ్రీకృష్ణుడా…శకుని మామయా!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*