ఇక కొంగజపం అనే మాట వాడకూడదు..! 

చెరువులో చేపల కోసం  కొంగ ఒంటికాలిపై నిలబడి ఉంటుంది. అదేదో జపం చేసుకుంటుందిలే అని దగ్గరికి పోతే…ముక్కుతో టపీమని చేపను పట్టుకుని మింగేస్తుంది. మళ్లీ ఏమీ ఎరగనట్టు ఒటికాలిపై నిలబడి జనంచేస్తున్నట్లు నటిస్తుంది. అందుకే ఎవరైనా కపటంగా వ్యవహరిస్తుంటే ‘ చేస్తున్నారు అని ఎద్దేవా చేస్తుంటాం. ఇకపై అలాంటి కపట నాటకదారుల ప్రవర్తనను కొంగజపంతో పోల్చడానికి వీల్లేదని నెటిజన్లు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే….

పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవర్తించిన తీరుకుని నిరసనగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకరోజు నిరశన దీక్ష పాటిస్తారట. అంటే ఏమీ తినకుండా నిరసన వ్యక్తం చేస్తారట. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు జరిగినన్ని రోజులు తెలుగు ఎంపిలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దాదాపు 13 పార్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఒక్క రోజు కూడా నోటీసులను చర్చకు రానీయలేదు. సభ ఆర్డర్‌లో లేదనే పేరితో ఆ నోటీసులను తోసిపుచ్చుతూ వచ్చారు. పార్లమెంటు జరిగినన్ని రోజులూ ప్రధాని ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఈసారి పార్లమెంటు జరిగిన తీరుపై దేశమంతా నిరసన వ్యక్తం చేసింది. బిజెపిని వేలెత్తి చూపింది. మోడీ మాత్రం తప్పందా ప్రతిపక్షాలదే అన్నట్లు మాట్లాడుతూ దీక్ష చేస్తామంటున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*