ఇదిగో పింక్‌ డైమైండ్‌ ఉంది! మాజీ ఈవోలు, జెఈవోలు భుజాలు తడముకోవడం ఎందుకు?

శ్రీవారి ఆభరణాల్లో పింక్‌ డైమైండ్‌ అనేదే లేదని టిటిడి అధికారులు చేస్తున్న వాదనలు సరికాదని, పింక్‌ డైమైండ్‌ ఉన్నట్లు టిటిడి రికార్డుల్లోనే ఉందని రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. ఆయన తిరుపతిలో మాడియాతో మాట్లాడుతూ…బంగారు డాలర్ల కేసులో విచారణ జరిపిన అప్పటి విసిఎస్‌ఓ రమణకుమార్‌ తన నివేదికలో పింక్‌ డైమైండ్‌ గురించిన ప్రస్తావన చేశారని చెప్పారు. రమణ దీక్షితులును తొలగిస్తూ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా పేర్కొన్నారు. నాలుగు మాడా వీధుల్లో ఏముందో కూడా తెలుసుకోక మునుపే….తొలి సమావేశంలోనే వివాదాస్పద నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని అన్నారు. సిబిఐ విచారణ అనే సరికి మాజీ ఈవోలు, జెఈవోలు స్పందిస్తూ…టిటిడి బంగారు ఆభరణాల భద్రతకు ఎలాంటి ఇబ్బందీ లేదంటూ స్పందిస్తున్నారని, గతంలో పని చేసిన ఈవోలు, జెఈవోలకూ ఇక్కడ జరిగిన అక్రమాల్లో భాగస్వామ్యం ఉందని, అందుకే భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. టిటిడి ఉన్నతాధికారులకు, అర్చకులకు నాల్కో అనాలసిస్‌ పరీక్ష నిర్విహించి అన్ని విషయాల బయటికొస్తాయని చెప్పారు. గతంలో ఓ ఉద్యోగికి ఇటువంటి పరీక్ష చేశారని చెప్పారు. శ్రీవారి ఆభరణాలను కొల్లగొట్టిన వాళ్ల జాతకాలన్నీ బయటపడే సమయం ఆసన్నమయిందని నవీన్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

1 Comment

  1. At this stage, appropriate inquiry is unavoidable requirement to safe guard the sacredness in the environment.

Leave a Reply

Your email address will not be published.


*