ఇది క‌దా మాన‌త్వ‌మంటే…!

మ‌న వారికి ఆప‌ద వ‌స్తే ఆదుకోవ‌డం వేరు…ఎక్క‌డో ఎవ‌రికో ఆప‌ద ముంచుకొస్తే చేయూత‌నందించ‌డం వేరు. ఎంతో మాన‌వ‌త ఉంటేగానీ…దూర‌పు వారిని ఆదుకోలేరు. కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చి జ‌నం అవ‌స్థప‌డుతుంటే….యుఏఈ (అరబ్‌ ఎమిరేట్స్‌) స్పందించింది. మ‌న భార‌తీయ సోద‌రుల‌ను ఆదుకోడానికి క‌ద‌లిరండి అని పిలుపునిచ్చింది. యుఏఈలో కేర‌ళ వాసులు ఎక్కువ మంది ఉంటున్న సంగ‌తి తెలిసింది. అలాంటి కేర‌ళ‌కు ఆప‌ద వ‌చ్చింద‌నే స‌రికి….ఆదేశ ఉపాధ్య‌క్షుడు స్పందించారు. భారతీయ సోదరులను ఆదుకుందాం రండి’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు.

యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్టోమ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా కేరళకు సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేస్తూ ‘ప్రకృతి అందాలకు నెలవైన కేరళకు కష్టం వచ్చింది. మనమందరం కలిసి ఆ రాష్ట్రాన్ని ఆదుకుందాం. మనకు చేతనైన సాయం చేద్దాం. యూఏఈలో ఉండే భారతీయులతో కలిసి కేరళకు సాయం చేయబోతున్నాం. మీరు కూడా వచ్చి మాతో చేతులు కలపండి. అక్కడి వారందరికీ తక్షణ సాయం అందించడానికి మేం ఓ కమిటీగా ఏర్పడ్డాం. మాతో వచ్చి మీరు చేయగలిగిన సాయం చేయండి. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఆరాష్ట్రాన్ని వరదలు చుట్టుముట్టాయి. ఇప్పటికే వందలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి తరుణంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. భారతీయ సోదరులను ఆదుకుందాం రండి’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు.

ఇది క‌దా మాన‌త్వ‌మంటే…! మ‌తం పేరుతో చిచ్చు పెట్టేవారికి ఇటువంటి ఉదంతాలైనా క‌నువిప్పు క‌లిగించాలి. ఎప్ప‌టికీ మ‌తం కంటే మాన‌త్వ‌మే గొప్ప‌ది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*