ఇళ్లు అద్దెకు ఇచ్చినట్లు…భార్యనూ అద్దెకిస్తారట!

ఇది వినడానికి నమ్మశక్యంగా లేకున్నా….మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ దారుణం జరుగుతోందట. నిరుపేదల ఇంటి మహిళలను నెలకు ఇంతని ఇచ్చి అద్దెకు తీసుకుంటున్నారట. ఇళ్లు అద్దెకు ఇచ్చినపుడు ఏవిధంగానైతే బాండుపేపరుపై ఒప్పందం రాసుకుంటామో….అదే విధమైన ఒప్పంద పత్రం రాసుకుని మరీ భార్యను అద్దెకు పంపుతున్నారట. ప్రధానంగా సంతానం లేని కలగని పురుష పుంగవులు అద్దె భార్యలను తీసుకొచ్చి సంతాన ‘భాగ్యం’ కోసం ప్రయత్నిస్తున్నారట. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దీధచ ప్రాత అనే పేరుతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మహిళ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఈ లీజు వ్యవహారం జరిగిపోతుంది. ఇద్దరు మగాళ్లు మాట్లాడుకుని…ఒప్పంద పత్రాలు రాసుకుంటారట. ఒప్పందం అయిపోయాక ఇంటికి తిరిగొచ్చిన స్త్రీని మరొకరికి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం చేస్తారట. గుజరాత్‌కు చెందిన ఓ నిరుపేద వ్యక్తి తన భార్యను ఒక పటేల్‌ ఇంట్లో నెలకి 8000 రూపాయల అద్దె భార్యగా పంపాడు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ.500 నుంచి రూ.60000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*