ఈనాడులో నో వర్క్ నో పే..! రామోజీరావు లేఆఫ్ అస్త్రం..!

కరోనా విపత్తు వేల పత్రికారంగం అతలాకుతల మవుతోంది. పత్రికలో పనిచేసే సిబ్బంది వీధుల పాలవుతున్నారు. ఇప్పటికే కొన్ని పత్రికలు సిబ్బందిని తొలగించాయి. వేతనాలు తగ్గించాయి. తాజాగా తెలుగులో అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడు అలాంటి చర్యలకు పూనుకుంది. పత్రికను పూర్తిగా మూసివేయకుండా, ఉద్యోగులను తొలగించకుండా తెలివిగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులే సంస్థను వీడి వెళ్ళిపోయేలా పొగబెడుతోంది. నో వర్క్ – నో పే పేరుతో ఉద్యోగుల వేతనాల్లో మూడింట రెండు వంతులపైగా కోత వేయడానికి సిద్ధమైంది.

ఈనాడు సోమవారం రాత్రి తమ ఉద్యోగులకు తెలియజేసిన ప్రకారం… డెస్క్ లో, మిషన్, ప్యాకింగ్ తదితర విభాగాల్లో పని చేసేవారికి నెల మొత్తం పని ఉండదు. కొందరికి నెలకు‌ పది‌ రోజులే పని ఉంటుంది. పని చేసిన రోజులకు మాత్రమే జీతం ఇస్తారు. కొందరికి ఐదు రోజులు మాత్రమే పని ఉన్నట్లు సమాచారం. అంటే ఉద్యోగులను తొలగించకుండా వేతనాలు మాత్రం భారీగా తగ్గించినట్లు లెక్క.

ఈనాడు తన ఉద్యోగులకు ఇచ్చిన లేఅఫ్ నోటీసు

ఈ నిబంధనలు జూన్ 30 దాకా అమల్లో ఉంటాయని, లేఆఫ్ ఎత్తివేస్తే ఒక రోజు ముందుగా ఫోన్ ద్వారా తెలియజేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఆసలు లే ఆఫ్ ఎత్తేస్తారా, పూర్తి రోజులు పని ఇస్తారా, పూర్తి వేతనం వస్తుందా అనేది‌ అనుమానమే. ఇది పొమ్మనలేక పొగబెట్టడమే అని ఈనాడు ఉద్యోగులు వాపోతున్నారు. ఈనాడు భవితవ్యం ఏమవుతుందో అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*