ఈ వారం ఎలిమినేషన్‌ ఉందా?

బిగ్‌బాస్‌ షోలో ఈ వారం ఆసక్తికర పరిణామం జరగబోతోందా? ప్రేక్షకులు ఊహించిన స్టిస్ట్‌ను బిగ్‌బాస్‌ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వారాంతమంటే ఎలిమినేషనే ప్రధానంగా ఉంటుంది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారు అనేదానిపైనే ప్రేక్షకులు ఆసక్తిచూపుతారు.

ఈ వారం రోల్‌రైడా, దీప్తి, తేజస్వీ, సామ్రాట్‌, తనిష్‌ ఈ ఐదుగురూ ఎనిమినేషన్‌ జాబితాలో ఉన్నారు. ఇందులో రోల్‌రైడా, దీప్తి, తనిష్‌ సురక్షితులైనట్లు ఇప్పటికే నాని ప్రకటించారు. ఇక మిగిలింది…తేజస్వీ, సామ్రాట్‌. మొదటి నుంచి ఈ జంట ఒకటిగా ఉంటోంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందన్న ఊహాగానాలూ వచ్చాయి. తేజస్వీ, సామ్రాట్‌లో ఏ ఒక్కరు బయటకు వెళ్లిపోయినా…జంట విడిపోతుంది. బిగ్‌బాస్‌ ఇంట్లో తనిష్‌-సునయన మరో జంటగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ జంటలు విడిపోతే….బిగ్‌బాస్‌ షోకు ఉన్న కాస్తోకూస్తో మజా లేకుండా పోతుంది. బిగ్‌బాస్‌ ఆశిస్తున్న మసాలా కరువవుతుంది. అందుకే ఈ వారం ఎవరినీ ఎలిమినేట్‌ చేయకపోవచ్చన్నది ఒక ఊహా. ఇది ఆదివారం రాత్రి తేలిపోతుంది.

ఇక శనివారం నాటి షోలో నాని ఈ వారం బిగ్‌బాస్‌ ఇంటి పరిణామాలపై విశ్లేషించారు. సినిమా చిత్రీకరణ టాస్క్‌ను ఇంటి సభ్యులందరూ ఎంతో మనసుపెట్టి చేశారంటూ నాని అభినందనలతో ముంచెత్తారు. ఇంటి సభ్యులు తీసిన సినిమాకు 4 స్టార్లు ఇచ్చారు నాని. నిజ జీవితంలో సినిమాలో వృత్తిగా కలిగిన ఇంటి సభ్యులు సహజంగానే సినిమా చిత్రీకరణ టాస్క్‌ను ఎంతో ఆసక్తిగా, శ్రద్ధగా చేశారు. నాని ప్రశంసలేకాదు..ప్రేక్షకుల అభినందనలూ సినిమాకు లభించాయి.

బిగ్‌బాస్‌ షోకు వివాదాలే కాదు…వినోదమూ కావాల్సిన అవసరం ఎంతగావుందో నాని కూడా గుర్తించినట్లు ఉన్నారు. ఇదేమాటను ఆయన శనివారం నాటి ఎపిషోడ్‌లో చెప్పారు. బిగ్‌బాస్‌ ఇల్లంటే వివాదాలు, గొడవలే అనుకుంటున్నారు…ఈవారం చూశాక, వినోదమూ ఎలావుంటుందో అందరికీ అర్థమయింది…అని వ్యాఖ్యానించారు. షోను సమీక్షిస్తున్న వారు మొదటి నుంచి చెబుతున్నది అదే. షోలో వివాదాలు తప్ప వినోదం ఉండటం లేదని. దాన్ని ఈ వారం కొంత సరిదిద్దారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*