ఈ స్టిక్కర్ అతికించిన ఇంటికి వెళ్లకండి..!

కరోనా వైరస్ వ్యాప్తిని‌ అరికట్టేందుకు అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లలో‌నే నిర్బంధిస్తున్నారు. అలాంటి వారు‌ 14 రోజుల పాటు ఇంటిలోనే ఉండాలి.‌ బయటకు రావడానికి వీల్లేదు. అదే విధంగా గృహ నిర్బంధంలో ఉన్న వారి ఇంటికి ఇతరులూ వెళ్లకూడదు. ఇటువంటి ఇళ్లను గుర్తించడం కోసం తిరుపతి మున్సిపల్‌ అధికారులు…ఆ ఇళ్ల ముందు ప్రత్యేకమైన స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఈ ఇంటిలోని వ్యక్తి గృహ నిర్బంధంలో ఉన్నారని, ఎవరూ ఇంటిలోనికి వెళ్ల వద్దని ఆ స్టిక్కర్ పైన రాస్తున్నారు. ఏ తేదీ దాకా ఆ ఇంటికి వెళ్ల కూడదో కూడా రాస్తున్నారు. ఇదిలావుండగా… గృహ నిర్బంధంలో ఉ‌న్న వ్యక్తి చేతిపైన పోలింగ్ ఇంకుతో స్టాంపు వేస్తున్నారు. ఆ స్టాంపు ఉన్న వ్యక్తి ఎప్పటిదాకా గృహ నిర్బంధంలో ఉండాలో ఆ స్టాంపుపై ముద్రిస్తున్నారు. స్టాంపు ఉన్న వ్యక్తి ఎవరైనా బయట తిరుగుతుంటే…ప్రజలు‌ ప్రశ్నించవచ్చు. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

1 Comment

  1. ఈమాత్రం ముందుజాగ్రత్త అవసరం

Leave a Reply

Your email address will not be published.


*