ఎంతయినా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మనవడు కదా…!

ఇదో ఆసక్తికరమైన వార్త. మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన వార్త. ఇంతకీ అదేమంటే…పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు…ఆయన మనవడు కూడా కలరిస్తున్నాడట. ఆ మాట బాబుగానే స్వయంగా చెప్పారు. ‘ఏం చేస్తున్నారా’ అని మా మనవడు దేవాన్ష్‌్‌ను అడిగిగే…’పోలవరం కడుతున్నా తాతయ్యా’ అంటున్నాడట. కేంద్ర బృందం పోలవరం పరిశీలనకు వచ్చి వెళ్లిన సందర్భంగా….ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగానే అధికారులను ఉత్సాహపరచడానికి తన మనవడి ప్రస్తావన తెచ్చారు. ఎంతయినా…ముఖ్యమంత్రి మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి మునిమనవడు, ఒక మంత్రికి కొడుకు…మరి దేవాన్ష్‌ అంతమాత్రం ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ…చిన్న పిల్లలు కూడా పోలీవరం కట్టాలని కోరుకుంటున్నారు…భవిష్యత్తు అంతా పోలవరంపైనే ఆధారపడివుంది. అందరూ కష్టపడి పనిచేసి నిర్మాణం పూర్తి చేయాలి. ఆటంకాలన్నీ తొలగిపోవాలి…అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*